Renu Desai | వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణు దేశాయ్ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కాస్తా రేణు వ్యాఖ్యలతో వివాదంగా మారింది.
వీధి కుక్కలపై జరుగుతున్న మరణకాండను నిరసిస్తూ.. ఎక్కడో ఒక కుక్క కరిస్తే ఆ నెపంతో వందలాది మూగజీవాలను విషమిచ్చి చంపడం ఏంటని రేణు తీవ్రంగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ.. సమాజంలో ఎవరో ఒక మగాడు అత్యాచారం లేదా హత్య చేస్తే ఆ నెపం మీద మగజాతి మొత్తాన్ని రేపిస్టులని ముద్ర వేసి అందరినీ చంపేస్తారా అని ఆమె సంధించిన ప్రశ్నలు సంచలనంగా మారాయి. దేశంలో ప్రతిరోజూ దోమకాటు వల్ల, రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో చనిపోతున్నా రాని ఆగ్రహం, కేవలం కుక్కల విషయంలోనే ఎందుకు వస్తోందని ఆమె నిలదీశారు. న్యాయవ్యవస్థపై కూడా అసహనం వ్యక్తం చేస్తూ కేవలం డబ్బు ఉన్నవారికే న్యాయం జరుగుతోందని, రక్షణ లేని మూగజీవాల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తనను విమర్శించిన ఒక వ్యక్తితో రేణు దేశాయ్ గట్టిగా వాదించారు. తాను ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడటం లేదని, చిన్నప్పటి నుంచి అనాథలకు, వృద్ధులకు సహాయం చేస్తున్నానని స్పష్టం చేశారు. అలాగే నోరు ఉంది కదా అని అర్థం లేకుండా మాట్లాడవద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ తాను మీడియాపై అరవలేదని, కేవలం స్టేజ్ మీదకు రావడానికి ప్రయత్నించిన అపరిచిత వ్యక్తిని మాత్రమే వారించానని క్లారిటీ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితాన్ని లేదా పిల్లలను ఈ వివాదాల్లోకి లాగవద్దని కోరుతూ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని ఆమె తేల్చి చెప్పారు.
నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, మనుషుల గురించి మాట్లాడుతున్న – రేణు దేశాయ్ pic.twitter.com/JJF2sHNvA1
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
ఐదు కుక్కలు కరిస్తే అన్ని కుక్కలను చంపుతున్నారు
అదే కొందరు మగాళ్ళు రేప్ చేస్తే, మర్డర్ చేస్తే.. అందరూ మగాళ్ళు రేపిస్టులు, మర్డరర్లు అవుతారా? – రేణు దేశాయ్ pic.twitter.com/B9JbR36iXo
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026