బాంబులెన్ని పేలినా..
భవనాలెన్ని కూలినా..
శరీరాలెన్ని చీలినా..
అసువులెన్ని రాలినా..
నేర్చుకోలేదింకా మనం ఏ పాఠం..!
సంయమనం పాటిస్తాం..
శాంతిమంత్రం జపిప్తాం..
దవాఖానల్లో చేర్పిస్తాం..
ఓ కన్నీటి బొట్టు రాల్చేస్తాం..
మరునాడు మరణాల సంఖ్య చాటేస్తాం..
ఆ తరువాత విషయాన్ని దాటేస్తాం..
బాంబనేది పిచ్చివాడి చేతిలో ఓ రాయి..
ఎవడు విసిరినా, వాడు మనకు పరాయి..
ఓ స్వప్న, ఓ వినోద్..
ఓ రఫీక్, ఓ ఎజాజ్..
మనిషెవరైనా.., మతమేదైనా&!
మారణహోమం మసి చేసింది..!
మానవత్వం మంటగలిసింది..!
– వీపూరి శ్రీనివాస్ 98498 93426