కల్లలెరుగని గిరి పుత్రులు
ఎల్లలులేని కష్ట జీవులు
వర్షాధార పంటలతో బతుకీడుస్తూ
వరుణ దేవుడికై ప్రార్థిస్తూ
అడవిని నమ్ముకున్న ఆదివాసులు
సాగు చేస్తున్న షెడ్యూల్డ్ తెగలు
ఆగమ్యగోచరమైన జీవితాలు
పొట్టనింపని రోజువారీ పనులు
అది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం
తెచ్చింది వారికై గిరి వికాసం పథకం
బోర్లు వేయించి నీటి వసతి కల్పించి
విద్యుత్ వెలుగులు ప్రసరించింది
బంజరు భూమిని పంటపొలాలుగా మార్చి
సేద్యంలో మెళకువలు నేర్పించింది
గతితప్పిన జీవితాలలో ఆశనింపి
అడవితల్లి సాక్షిగా రా రాజును చేస్తుంది.
డాక్టర్ జి. దీపా రెడ్డి
70329 82021
డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్
వికారాబాద్ జిల్లా
తెలంగాణ.