కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్నా
కరువు బాధ వెంట తెచ్చెనా
నీ పంటను ఎండబెట్టెనా రైతన్నా
నీ బతుకుల మంట పెట్టెనా..
ఇంతలోనే తెలంగాణ ఎందుకింత ఆగమాయె?
మంచిగున్న రైతు బతుకు మసకబారి పోయేనేల?
ఎండిపోయిన పంటసేను పసుల మేతకిడ్శినావ
పర్రెలు పాసిన పొలములోన పొర్రి పొర్రి ఏడ్శినావ
కాంగిరేసు పాలనొచ్చెనా
మాయమైన బోరు బండ్లు మళ్ల ఊరి దారి పట్టె
బాయి పూడ్కె దీసె క్రేను మోత మల్ల మోగవట్టె
వచ్చీపోయే కరెంటుతో మోటరేమో కాలిపాయే
కర్సూలేమో పెరిగిపాయే అర్సుకునె దిక్కే లేదు
అడ్గపోతే ముఖ్యమంత్రి కయ్య కయ్య ఒర్రవట్టె
రైతన్నల పానాలతో రాజకీయమాడవట్టె
కాంగిరేసు పాలనొచ్చెనా
ఎత్తు మీదికి ఎత్తి పోసిన గోదావరి నీళ్లు ఏవీ?
ఎండకాలమైన దుంకిన మత్తడి జాలు జాడేమాయే?
కువారాన ముఖ్యమంత్రి కుట్ర మనసుల పెట్టుకోని
కాళేశ్వర ప్రాజెక్టును కావాలని పండవెట్టి
దుక్కమెల్లదీసె రైతు దిక్కూగూడ చూడడాయే
కిరికెట్టు మ్యాచును చూసి కిల కిల కిల నవ్వుడాయే
కాంగిరేసు పాలనొచ్చెనా
పంటగోసె కాలమైన రైతుబంధు రాకపాయే
షావుకారు కాడ మల్ల అప్పు జెయ్యక తప్పకపాయే
వడ్డీ మీద వడ్డీ పెరిగి నడ్డి ఇరిగిపోయినాది
ఉరివేసుక రైతన్నలు ఉసురు తీసుకుంటున్నారు
మదమెక్కిన మంతిరేమో మంచీచెడ్డ మరిచిపాయే
రైతుబంధు అడిగినోన్ని చెప్పుతోని కొడుతాననె
కాంగిరేసు పాలనొచ్చెనా
మాటలెన్నో జెప్పి మనల మాయజేసే కాంగిరేసు
పంటలన్నీ కొంటానని ప్రమాణమూ జేసినాది
ఐదొందలు బోనసని ఆశపెట్టి గెలిచినాది
వానాకాలం పంటనమ్మితే బోనసు లేదు గీనసు లేదు
యాసంగి పంటనమ్మితే మోసమే ఎదురయ్యినాది
బోనసనే మాట ఉత్తబోగసనే తేలినాది
కాంగిరేసు పాలనొచ్చెనా
తెలంగాణ కోసమని పోరాడిన కేసీఆరు
తెచ్చుకున్న తెలంగాణ ఎంతో సక్కగ చేసినాడు
పంపు నిండ నీళ్లు ఉండే – తెంపు లేని కరెంటుండే
రైతుబంధు సాయముండే సర్కారిచ్చిన హిమ్మతుండే
పుట్ల కొద్దీ పంట దీసి పైసా కండ్ల జూసినాము
ఖర్మగాలి కాంగిరేసుకు ఓటు వేసి మోసమాయే
కేసీఆరుతోటే మల్ల పోరుబాటల నడుద్దాము
కరువు లేని తెలంగాణకై రైతన్నా – కారు గుర్తుకోటువేద్దాము
కాంగిరేసు పని పడదాము రైతన్నా- కేసీఆర్‌కే బలమిద్దాము
దేశపతి శ్రీనివాస్