త్యాగరాయ గానసభ సౌజన్యంతో, భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కళా సంగీత నాట్య వేదిక, త్యాగరాయ గానసభలో నవంబర్ 5న బుధవారం ఉదయం 9.30 గంటలకు పుస్తకాల ఆవిష్కరణ సభ జరగనున్నది. నమిలకొండ నాగేశ్వర్రావు రాసిన ‘అక్షర రథం’ కవితా సంపుటి, వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన ‘నాకు నచ్చిన నా కవిత’ కవితా సంకలనం ఆవిష్కరణ జరుగనున్నది. డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సభాధ్యక్షత వహించనున్నారు. నందిని సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, దేవీప్రసాద్, శేషం సుప్రసన్నాచార్యులు, బ్రహ్మశ్రీ పాణ్యం దత్తశర్మ, చౌడూరి నరసింహారావు తదితరులు హాజరవుతారు.