బొక్కలు ఫ్లోరోసిస్ చెదలు వట్టి
గుండెలవిసిపోతున్న గొంతుల్ల
ఎక్కిళ్ళువడుతున్న కన్నీటి పొరలు
కరువు కాకిశోకపు వలస నేల మీద
మలిదశ మాయిముంతల
అమరుల త్యాగాల కలలన్నీ
ఫీనిక్స్ పక్షికి నిప్పుల ఊపిరులూదిన యాళ్ల
పుట్టిందొక పెనుమంటల పొలికేక
నెర్రెలిడిసిన అరిగోసల బతుకులు
చెట్టుకోలు పుట్టకోలు వొడిసెల రాైళ్లె
తనువును పొక్కిలి చేసుకొని
ఎదుర్రొమ్మును చీల్చుకొని సకల ఉద్యమాల
లావాను గొంతు పాళీల్లో దట్టించుకొని
సబ్బండ మానవ సమూహాలు
పల్లె పిడికిల్ల పొలిమేరలై నినదించి
పార్లమెంటుల భూకంపం పుట్టించిన యాళ్ల
పొత్తిళ్ల నెత్తుటి గుడ్డయి నినదించిన
అరవయ్యేండ్ల అజరామర స్వప్నం
జై తెలంగాణ!!
– విశ్వనాథుల పుష్పగిరి 96664 35426