ఆధారం లేని అనాధ పిట్టలు
మిన్నంటి ఎగరడానికి
ఆసరా పథక రెక్కలనిచ్చి
ఆటుపోట్ల జీవితాన్ని
ఒడ్డుకు చేర్చి
గీతలపడిన బతుకులను
ఊత కర్రనిచ్చి నిలబెట్టింది
ఎన్నో బతుకుల ఆకలి
మంటలను చల్లార్చి
ఎండిన కడుపులను
నిండుగా నింపి
దండి ధైర్యం అయింది
ఏ మైలురాయి కాడో
తప్పిపోయిన సగటు
జీవితాల్ని మలుపు తిప్పి
కొత్త దారిని చూపింది
అలసిన దేహాలకు ఊపిరిలూది
ప్రాణాలను నిలబెట్టి
గూడుకట్టుకున్న ఆత్మనూన్యతలను
పారద్రోలి
గుండె దిగులను తరిమికొట్టి పరోపకారమై
సంక్షేమ ఫలాలు అందించింది
నిలదొక్కుకునే నిచ్చనై
ఆసరా పథకంతో
కొత్త స్పర్శలద్దిన
తెలంగాణ ప్రభుత్వం
Nellutla Sunita
– నెల్లుట్ల సునీత
ఖమ్మం
7989460657