కడిగిపారేద్దాం!
పురుగుమందులు, కూరగాయలు.. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్రిమిసంహారకాలు వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే.. నేరుగా మన శరీరంలోకి వెళ్లడం తథ్యం. అందుకే పురుగుమందులను కడిగేసే కొన్ని ఉపాయాలు చెబుతున్నారు నిపుణులు.
పురుగుమందులు, కూరగాయలు.. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్రిమిసంహారకాలు వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే.. నేరుగా మన శరీరంలోకి వెళ్లడం తథ్యం. అందుకే పురుగుమందులను కడిగేసే కొన్ని ఉపాయాలు చెబుతున్నారు నిపుణులు.
- కూరగాయలు, పండ్లకు అంటిన పురుగు మందులను వదిలించేందుకు రకరకాల యంత్రాలు మార్కెట్లోకి వస్తున్నాయి. నిజానికి, నీటితోనే 90 శాతం శుభ్రత సాధ్యం.
- కూరగాయలకు అంటిన రసాయనాలను శుభ్రం చేయడానికి ఓ చిట్కా ఉంది. ఒక గిన్నె నీటిలో నిమ్మరసం, సోడా, ఆపిల్ సిడార్ వెనెగర్ కలపాలి. ఆ ద్రవాన్ని కూరల మీద చల్లి ఐదారు నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.
- కూరగాయల పైన తొక్క తీసేయాలి అనుకున్నప్పుడు వాటిని కడగాల్సిన పన్లేదు అని చాలామంది అభిప్రాయం. తొక్క తీసేటప్పుడు వాటికి ఉన్న సూక్ష్మక్రిములు కూరగాయల మీద పరుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తొక్క తీసేముందు కూడా కడగాల్సిందే.
- ఇంట్లో పెంచుకున్న, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలపై పురుగుమందులు లేకపోవచ్చు. కానీ బ్యాక్టీరియా తిష్ఠవేసే ప్రమాదం లేకపోలేదు. వాటినీ శుభ్రం చేయాల్సిందే.
- చాలామంది కూరగాయల్ని ఇంటికి తెచ్చుకున్న వెంటనే శుభ్రం చేసి సంతృప్తి పడిపోతారు. కానీ వాడేలోపు… వాటి మీద బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ కూరగాయనూ వాడేముందు మళ్లీ కడగాలి.
- కూరగాయలో కొంతభాగం పాడైతే… అంతవరకూ తుంచేసి వండుకోవడం మనకు అలవాటు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. అలాంటివాటిని పారేయడమే మేలు.
- చాలామందికి పచ్చికూరగాయలు తినడం అలవాటు. శుభ్రంగా కడిగిన తర్వాత కూడా మిగిలిపోయే బ్యాక్టీరియాతో అసలుకే మోసం రావచ్చు. కాబట్టి డైటీషియన్‌ను సంప్రదించి ఏ పచ్చి కూరగాయల్ని ఎలా తినాలో తెలుసుకోవాలి. వాటినే ఆరగించాలి. నిజానికి కొన్నిటిని పచ్చిగా తినడం ఆరోగ్యకరం కాదని కూడా చెబుతారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

