Tea | ఛాయ్ అంటే ఇష్టం ఉంటే సరే.. కానీ అదే పనిగా కప్పులు కప్పులు తాగొద్దని చెప్పే చిట్టి కథ
Tea History | మేధో మథనంలో తేనీటిని మించిన ఉత్ప్రేరకం లేదని చాలామంది భావన. ముఖ్యంగా చాయ్‌తో కవులు, కళాకారుల అలయ్‌బలయ్ ఈనాటిది కాదు! నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక అవధాన శిరోమణి తేనీటిని ప్రాణ సమానంగా ప్రేమించేవారు. తన అవధానంలో పద్యానికో టీ నిర్మొహమాటంగా పుచ్చుకునేవారు! హితులు, సన్నిహితులు వారించినా వినేవారు కాదు!
Tea History | మేధో మథనంలో తేనీటిని మించిన ఉత్ప్రేరకం లేదని చాలామంది భావన. ముఖ్యంగా చాయ్‌తో కవులు, కళాకారుల అలయ్‌బలయ్ ఈనాటిది కాదు! నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక అవధాన శిరోమణి తేనీటిని ప్రాణ సమానంగా ప్రేమించేవారు. తన అవధానంలో పద్యానికో టీ నిర్మొహమాటంగా పుచ్చుకునేవారు! హితులు, సన్నిహితులు వారించినా వినేవారు కాదు! పైగా ఉష్ణోదకం జిహ్వకు తాకి, మస్తిష్కానికి పాకితే గానీ.. యతిప్రాసలు ప్రశస్తంగా రావని చెబుతుండేవారు. అంతేకాదు, తన సంచిలో ఎప్పుడూ పొట్లంలో టీపొడి, చక్కెర, సీసాలో పాలు, నీళ్లు ఉంచుకునేవారు. పక్క ఊరికి వెళ్లాల్సి వస్తే వెంటబెట్టుకునేవారు.
సైకిల్ బ్యాక్ క్యారియర్‌కు స్టౌ తగిలించుకునేవారు. పది కిలోమీటర్ల ప్రయాణంలోనూ కనీసం ఒకసారైనా.. ఏ చెట్టుకిందో ఆగి టీ కాచుకొని తాగేవారు. ఇలా జీవితంలో సింహభాగం ఏకాక్షరి సాధనలో గడిపిన ఆ కవిశ్రేష్ఠుడు ఒకానొక సందర్భంలో తేనీటితో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక శుభ తిథి ఎంచుకొని బిందె నిండా స్వయంగా చాయ్ కాచారు. కప్పు మీద కప్పు తాగుతూనే ఉన్నారు. ఏముంది సాయంత్రానికి జఠరాగ్ని వెనక్కి తన్నడంతో.. తాగిన తేనీరంతా బయటికి ఉబికి వచ్చింది. పెద్దాయనకు టీపై వైరాగ్యం పుట్టుకొచ్చింది. ఆనాటి నుంచి ఆ కవిద్రష్ట కన్నుమూసే వరకు చాయ్ ముట్టుకోలేదు.
‘అతి సర్వత్ర వర్జయేత్’ అని పెద్దలు ఊరికే అనలేదు కదా! తినే ఆహారమైనా, తాగే తేనీరైనా మితంగా తీసుకుంటేనే సుఖం. ఈ కట్టు తప్పినవాళ్లు కొందరు పట్టుదలగా అయినా టీని ముట్టుకోకూడదనే సంకల్పంతో తేనీటిని కాశీ గంగ నీటిలో వదిలి.. ఒట్టుపెట్టుకున్నారు కూడా!!

బ్లాక్ టీ
కావలసిన పదార్థాలు
టీ పొడి: ఒకటిన్నర టీస్పూన్, నీళ్లు: రెండు కప్పులు, నిమ్మరసం: రెండు టీ స్పూన్లు.
తయారీ విధానం..
గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అందులో టీ పొడి వేసి.. మరో రెండు నిమిషాలపాటు సన్నని మంటపై మరిగించాలి. కప్పులో నిమ్మరసం పోసి.. టీ వడకట్టుకోవాలి. బ్లాక్ టీ సిద్ధం. తీపి కావాలనుకునేవాళ్లు తగినంత తేనె కూడా వేసుకోవచ్చు!
‘టీ’కా తాత్పర్యం
నా గందరగోళాన్ని తొలగించడానికి ఒక కప్పు టీ అందించగలిగితే.. వారి సమస్యలను బాగా అర్థం చేసుకొని, చక్కగా పరిష్కరిస్తాను!
బ్రిటన్ రచయిత చార్లెస్ డికెన్స్
Read More :
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
“Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- culture
- recipe
- tea
- Tea History
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

