వర్షాకాలం.. మొక్కల పెరుగుదలకు అనుకూల సమయం. దాంతో చాలామంది గార్డెనింగ్‌కు ఆసక్తి చూపుతారు. మొక్కలు, కుండీలు తీసుకొచ్చి.. పెరటితోటల పెంపకం మొదలుపెడతారు. అలాంటివారు తెలిసీ తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు.. మొక్కలకు చేటు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ‘గార్డెనింగ్’లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.