ముద్దు ఒక తీయని అనుభూతి. ముద్దు ఇద్దరి మధ్య ఉండే సాన్నిహిత్యమే కాదు. ఇద్దరికీ సౌకర్యం కూడా! అయితే, ముద్దులాడే సందర్భంలో కొందరికి అనుకోని అసౌకర్యం కలుగుతుంది. మనసులో ప్రేమ ఉన్నా కలిగే ఈ అసౌకర్యాన్ని ఎదుటివాళ్లు అర్థం చేసుకోవాలి. అలాగే ఆ అసౌకర్యం కలిగినవాళ్లు చర్మాన్ని అర్థం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
గడ్డం ఉన్నవాళ్లు సన్నిహితంగా ఉన్న సందర్భంలో అవతలి వ్యక్తి చెక్కిళ్లపై పదే పదే ఆ గడ్డం రాసుకుపోతూ ఉంటుంది. దీనివల్ల కొందరికి బుగ్గలపై దురద, మంట, చర్మం ఎర్రబారడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల చర్మం చాలా సున్నితమైనదని గుర్తించాలి.
ముద్దులకే కందిపోయే స్కిన్ బయటి వాతావరణంలోని దుమ్ము, కాలుష్యాలకు కూడా ప్రభావితమవుతూ ఉంటుంది. కాబట్టి చర్మ వైద్యులతో సరైన చికిత్స చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే బుగ్గలు ఎర్రబారడం, పొడిబారడం, నొప్పి లాంటి సమస్యలకు తొందరగా పరిష్కారం దొరుకుతుంది.