Private Party Theater | లవర్‌కు లవ్లీ ట్రీట్ ఇవ్వాలనుకోవడం, డ్యూడ్ని మ్యాడ్‌గా సర్ప్రైజ్ చేయాలనుకోవడం, క్రేజీ ఫ్రెండ్స్‌తో జాలీగా చిల్ అవ్వాలనుకోవడం.. ఇవన్నీ సాధారణమే. కానీ వీటిని కాస్త అసాధారణంగా చేస్తేనే ట్రెండీ గాయ్స్ అనిపించుకుంటారు. జెన్ జెడ్ పేరును నిలబెట్టు కుంటారు. మనకు మాత్రమే అన్నట్టు ఉండాలని ప్రతి చోటా పర్సనల్ స్పేస్ కోరుకునే వాళ్ల కోసం ఇప్పుడు ‘ప్రైవేట్ పార్టీ థియేటర్లు’ ముస్తాబవుతున్నాయి. ఎంచక్కా కేక్ కట్‌చేసుకుని, కాసేపు సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Private Party Theater2
మన దోస్తు బర్త్‌డే.. సెలబ్రేషన్ ఎక్కడ చేద్దాం.. అన్న ఆలోచన ప్రతి ఫ్రెండ్స్ సర్కిల్లోనూ వస్తుంది. అయితే ఇప్పుడు స్పేస్ వెతకడానికో, బెలూన్లు ఊది డెకరేషన్ చేయడానికో చాలా మందికి తీరిక ఉండట్లేదు. అలాగని దోస్త్నో, లవర్‌నో సర్ప్రైజ్ చేయాలన్న ఆలోచన మాత్రం పోవట్లేదు. అటు పార్టీ జరగాలి, ఇటు ఎక్కువ టైమ్ వేస్ట్ అవకూడదు.. అనే కాన్సెప్ట్ ‘ప్రైవేట్ థియేటర్లు’ పుట్టుకురావడానికి కారణం కావచ్చు.

Private Party Theater3
షార్ట్ అండ్ స్వీట్.. ఈ తరానికి ఇదే తారక మంత్రం. ఈ ప్రైవేట్ థియేటర్లను రెండు మూడు గంటల కోసం బుక్ చేసుకోవచ్చు. గదిలో పెద్ద స్క్రీన్ ఉంటుంది. అనుసంధానంగా మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. కూర్చోవడానికి రిైక్లెనర్ కుర్చీలు, సోఫాల్లాంటివి ఉంటాయి. కేక్ కటింగ్ కోసం ప్రత్యేక అలంకరణ చేస్తారు. అలా మొత్తం సెట్చేసిన గదిలోకి వెళ్లి చక్కగా కేక్ కట్ చేసుకుని, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లాంటి వాటిలో ఓ రెండు గంటల సినిమాలో, నచ్చిన వీడియోలో చూసి రావచ్చు. కేక్, స్నాక్స్, డ్రింక్స్ లాంటివి మనమే తీసుకెళ్లొచ్చు. లేదా వాళ్లే ఏర్పాటు చేస్తారు. పుట్టిన రోజు, పెళ్లిరోజు, లవర్స్ స్పెషల్ డెకరేషన్.. ఇలా విభిన్న రకాల అలంకరణలను ఎంపిక చేసుకోవచ్చు. ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇద్దరు మొదలు పన్నెండు మందిదాకా పార్టీ చేసుకోవచ్చు. అలా కాకుండా జంట మాత్రమే వెళ్లాలనుకుంటే ప్రత్యేక అలంకరణతో కపుల్ థియేటర్లూ ఉన్నాయి. ద బింగీ టౌన్, చెరిష్ ఎక్స్, బింగీ ఎన్ బాష్లాంటి సంస్థలు ఈ రకమైన సౌకర్యాన్ని అందజేస్తున్నాయి. ఈ పార్టీ థియేటర్‌కు తీసుకెళ్తే.. మీ బంగారం ‘లవ్యూ బంగారం!’ అనకుండా ఎలా ఉండగలదు!

Private Party Theater4

Private Party Theater6

Private Party Theater7

Private Party Theater8

Private Party Theater9

Private Party Theater10

Private Party Theater11

Private Party Theater12