Flyrobe | ఫ్యాషన్ డబ్బున్నోళ్ల సొత్తు కాదు.. ఇదే ఈమె సక్సెస్ఫుల్ బిజినెస్ వెనుక ఉన్న నినాదం
Aanchal Saini ఫ్యాషన్ డబ్బున్నవారి సొత్తు కాదు. ఆకర్షణీయంగా కనిపించడం అందరి హక్కు. ఇదే అంచల్ సైనీ నినాదం. ‘సంపన్నులైనా, సామాన్యులైనా ఖరీదైన దుస్తుల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టడం మంచిదికాదు.
Flyrobe | ఫ్యాషన్ డబ్బున్నవారి సొత్తు కాదు. ఆకర్షణీయంగా కనిపించడం అందరి హక్కు. ఇదే అంచల్ సైనీ ( Aanchal Saini ) నినాదం. ‘సంపన్నులైనా, సామాన్యులైనా ఖరీదైన దుస్తుల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టడం మంచిదికాదు.‘రెంట్ ది ఐకానిక్, బై ద బేసిక్’ అని పిలుపునిస్తారామె. అసలు, ఓ స్థాయికి మించి బట్టలు కొనాల్సిన అవసరమూ లేదు. ప్రత్యేకించి.. ఫంక్షన్లు, పార్టీల కోసం బ్రాండెడ్ దుస్తులకు ఎగబడటం మూర్ఖత్వమే అవుతుంది’ అంటారు. తన ఆలోచనలకు అనుగుణంగానే ‘ఫ్లైరోబ్’ అనే స్టార్టప్‌ను తీర్చిదిద్దారు.
ఇది నూటికి నూరుశాతం పార్టీవేర్ను అద్దెకిచ్చే ఆన్లైన్ వ్యాపారం. పట్టుచీరలు, డిజైనర్ డ్రెస్‌లు, లెహంగాలు, కుర్తాలు.. ఫ్లైరోబ్లో లేని దుస్తులంటూ ఉండవు. వాటి మార్కెట్ ధరలో ఐదు నుంచి పదిశాతం అద్దెగా చెల్లిస్తే చాలు. ఇంటికే తెచ్చిస్తారు. ఇప్పటికే ఫ్లైరోబ్ సేవలు హైదరాబాద్ సహా ముప్పై నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రాంచైజీ మాడల్‌లో వ్యాపారాన్ని దేశమంతా విస్తరించాలని ఆమె ఆలోచన. తమ బ్రాండ్‌ను విదేశాలకూ తీసుకెళ్లే ఆలోచన ఉందని చెబుతారు. సైనీ పేరున్న లాయర్, ఆంత్రప్రెన్యూర్ కూడా. ముంబైలో చదువుకున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

