చలికాలంలో చాలామందికి నిద్రలేచే సరికి ముక్కు పుటాలు మూసుకుపోతుంటాయి. అలర్జీలు, గాలి పొడిబారడం, సైనసైటిస్తోపాటు గొంతులో శ్లేష్మం పేరుకుపోవడం, పడుకున్నప్పుడు రక్త ప్రసరణ పెరగడం వీటన్నిటి వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. రాత్రంతా బాగానే ఉన్నా.. ఉదయం లేచేసరికి ముక్కు మూసుకుపోయి సతమతమవుతుంటారు.
ముకు మూసుకుపోకుండా ఉండాలంటే పర్యావరణం, వ్యక్తిగత అంశాలను దృష్టిలో ఉంచుకొని ముకు మార్గాలను శుభ్రంగా, తేమగా ఉంచుకోవాలి. ఇందుకోసం రోజూ పడుకునే ముందు, ఉదయం లేచిన తరువాత ఉప్పు నీటితో ముకును శుభ్రం చేసుకోవాలి. బెడ్ షీట్లు, దిండు కవర్లను వారానికోసారి వేడి నీటితో ఉతకాలి. గదిలో దుమ్ము, ధూళి పేరుకుపోకుండా జాగ్రత్త వహించాలి.
గదిలో గాలి చాలా పొడిగా ఉంటే తేమను పెంచే హ్యుమిడిఫైయర్ను ఉపయోగించాలి. ఘాటైన రూమ్ ఫ్రెష్నర్లు, అగరబత్తులను వీలైనంత వరకు వాడకపోవడమే మేలు. ఉదయం పూట 5 నుంచి 10 నిమిషాలపాటు ఆవిరి పట్టడం వల్ల శ్లేష్మం కరిగి, ముకు మార్గాలు తెరచుకోవడానికి వీలవుతుంది. ఖర్చులేకుండా చేసే ఈ పనులు.. చలికాలంలో ముక్కు దిబ్బడపాలు పడకుండా కాపాడుతాయి.