చర్మాన్ని శుద్ధి చేయడానికి పాలు మంచి సాధనంగా ఉపయోగపడతాయి. క్లెన్సింగ్ మిల్క్ స్థానంలో నేరుగా పాలనే వాడవచ్చు. అందుకోసం కొద్దిగా పాలను తీసుకుని అందులో దూదిని ముంచాలి. దానితో ఎక్కడైతే మేకప్ ఎక్కువగా వేస్తామో లేదా జిడ్డు అధికంగా ఉంటుందో ఆ ప్రాంతమంతా సున్నితంగా అద్దాలి. ఆ తర్వాత తుడిచేయాలి.
మేకప్ లేదా క్రీముల వాడకం వల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలను పాలు శుభ్రం చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచేందుకూ సాయపడతాయి.