స్లీపింగ్ సోపానాలు
ఆధునిక జీవితం.. ఉరుకులు పరుగులు, తీరికలేని పనులు, ఒత్తిడిలోనే గడిచిపోతున్నది. దాంతో, రాత్రిపూట కంటిమీద కునుకు కరువవుతున్నది.
ఆధునిక జీవితం.. ఉరుకులు పరుగులు, తీరికలేని పనులు, ఒత్తిడిలోనే గడిచిపోతున్నది. దాంతో, రాత్రిపూట కంటిమీద కునుకు కరువవుతున్నది. వెరసి.. లేనిపోని రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉన్నది. దీనిని తప్పించుకోవడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి వైద్య నిపుణులు కొన్ని సలహాలు-సూచనలు అందిస్తున్నారు.
- రాత్రి భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. కమ్మటి నిద్ర పడుతుంది. మాంసాహారం, మసాలాలు దట్టించిన ఆహారాన్ని పక్కన పెట్టాలి. తేలికగా జీర్ణమయ్యే వాటినే ఎంచుకోవాలి. అదికూడా రాత్రి 7-8 గంటల మధ్యలోనే రాత్రి భోజనాన్ని ముగించాలి. ఇక పడుకోవడానికి ముందు ఒక గ్లాసు గోరు వెచ్చటి పాలు తాగితే.. ఇట్టే నిద్ర పట్టేస్తుంది.
- ఆధునిక జీవితంలోకి ప్రవేశించిన మరో స్మార్ట్ భూతం.. ఫోన్! బెడ్పైన వాలడానికి ఓ గంట ముందే.. దీనిని మూలన పడేయాలి. స్మార్ట్ఫోన్ చూస్తూ పడుకోవడం నిద్రకే కాదు.. ఆరోగ్యానికీ ఏమాత్రం మంచిదికాదు. రాత్రిపూట ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే.. కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి కూడా వేధిస్తుంది.
- పడక గది వాతావరణం కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. గదిలో ఎక్కువ లైటింగ్ లేకుండా, బయటి శబ్దాలు ఎక్కువగా వినిపించకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. ఇవి నిద్రను పాడు చేసే అవకాశం ఉంటుంది.
- పడకపైకి చేరిన తర్వాత.. రోజంతా ఎదురైన సమస్యలకు బదులుగా, మంచి మంచి విషయాలను నెమరువేసుకోవాలి. నెగెటివ్ ఆలోచనలను మనసులోకి రానివ్వొద్దు. జీవితంలోని సంతోష సమయాలను గుర్తు చేసుకుంటూ.. పాజిటివ్ వైబ్స్తో నిద్రలోకి జారుకుంటే, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కమ్మటి నిద్ర పడుతుంది.
- వేళాపాళా లేని నిద్ర వేళలు కూడా మంచిదికాదు. పడుకోవడానికి ప్రతిరోజూ ఒక కచ్చితమైన సమయాన్ని ఎంచుకోవాలి. అప్పుడే.. కంటి మీదికి కునుకు వస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

