సాధారణంగా ప్రతి ఒక్కరూ కనీసం ఆరేడు గంటలైనా నిద్రపోతారు. పడుకునేటప్పుడు చాలామంది
తలకింద దిండు పెట్టుకుంటారు. పత్తితో తయారైన మెత్తటి పిల్లోపై.. కమ్మటి నిద్రలో జోగిపోతారు. అయితే.. కాటన్‌తో చేసిన దిండు కవర్ల వల్ల చర్మానికి, జుట్టుకు హాని కలుగుతుందని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాటన్‌కు బదులుగా పట్టుతో తయారైన కవర్లు వాడటమే మంచిదని సూచిస్తున్నారు. జుట్టు ఆరోగ్యంతోపాటు చర్మ సంరక్షణలోనూ పట్టు కవర్లు సాయపడతాయని చెబుతున్నారు.
ఇలా.. ఒక్క దిండు కవర్‌ను మార్చేస్తే.. చర్మం, జుట్టు ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది. ముఖ్యంగా, సున్నితమైన చర్మం, జుట్టు ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.