ఉద్యోగాలంటేనే.. ఉరుకులు, పరుగులు! నెలవారీ టార్గెట్లు! జీవనశైలి లోపాలు, మారుతున్న ఆహారపు అలవాట్లు! అన్నీ కలిసి ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. అందులోనూ, ఉద్యోగంతోపాటు ఇంటినీ నెట్టుకొస్తున్న మహిళలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా.. వారిని అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాటినుంచి బయటపడేందుకు కొన్ని అలవాట్లను మార్చుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న మార్పులతో ఒత్తిడిని చిత్తు చేయొచ్చని అంటున్నారు.