‘ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాల్సిందే!’ అనే లక్ష్యంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తారు చాలామంది. అనుకున్నదే తడవుగా జిమ్‌లో చేరిపోతారు. ఎంతో కొంత డిస్కౌంట్‌తో ఏడాది ఫీజు మొత్తం చెల్లిస్తారు. కానీ, అదంతా ఆరంభ శూరత్వమే! జనవరి పూర్తయ్యే సరికి.. రోజువిడిచి రోజు కూడా వెళ్లలేరు. ఫిబ్రవరి వచ్చాక.. అటువైపు వెళ్లడమే మానేస్తారు. ఇలాంటి లక్ష్యంతో ఏడాదిని ప్రారంభించేవారిలో 80 శాతం మంది.. మధ్యలోనే ఆయా తీర్మానాలను అటకెక్కిస్తున్నారట. అయితే, కొంచెం స్మార్ట్‌గా ఆలోచిస్తే.. బరువు తగ్గాలన్న లక్ష్యాన్ని ఏడాది పొడవునా కొనసాగించవచ్చు.
అలా కాకుండా.. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే.. ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోవడమే వృథా! అందుకే మీకు మీరే.. బెస్ట్ క్రిటిక్. అప్పుడే అనుకున్నది సాధించ గల్గుతారు.