హోలీ.. జాగ్రత్తగా జరుపుకొంటే ఆనందాల్ని పంచుతుంది. రంగుల కేళిలో ఏమరుపాటుగా ఉంటే మాత్రం.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా, రసాయన రంగులు చల్లుకుంటే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. ఈ జాగ్రత్తలు పాటించండి.
హోలీ ఆడిన తర్వాత నిమ్మరసంతో గోళ్లు శుభ్రం చేసుకోండి. ఇందుకోసం నిమ్మకాయను సగానికి కోసి.. దానిపై కొద్దిగా పంచదార చల్లండి. దాని సాయంతో గోళ్లను
నెమ్మదిగా రుద్దితే.. రంగుల మరకలు ఇట్టే తొలగిపోతాయి.