భారతీయులు ఇష్టంగా తినే పండ్లలో అరటి ముందుంటుంది. రుచితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. అయితే, పండు మాత్రమే కాకుండా.. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా లభించే ఐరన్, ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం, పొటాషియం, భాస్వరం.. అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని అంటున్నారు.