Health Tips | వేసవి తాపం నుంచి శరీరాన్ని రక్షించే ఈ పానీయాల గురించి మీకు తెలుసా..?
Health Tips | వేసవి ప్రారంభం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే ఈ ఎండలు ఆరోగ్యానికి హానికరం. శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది.
వేసవి ప్రారంభం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే ఈ ఎండలు ఆరోగ్యానికి హానికరం. శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. అందువల్ల నీరసించిపోవడం, వడదెబ్బ తగలడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి రాకూడదంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. మరి ఆ పానీయాలేంటో ఒకసారి చూద్దామా..!
వేసవి తాపం తీర్చే పానీయాలివీ..
చల్ల: పెరుగులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని గిలకొట్టి చల్ల చేసుకోవాలి. ఈ చల్లలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి దెబ్బకు తగ్గిపోతుంది.
జల్జీరా: నాలుగు చెంచాల ఆమ్చూర్ పొడి, అంతే పరిమాణంలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, చక్కెర, అర చెంచా మిరియాల పొడి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లలో కలిపితే జల్జీరా మిశ్రమం రెడీ అవుతుంది. అది తాగితే డీ హైడ్రేషన్ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
కొబ్బరి నీళ్లు: ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
షర్బత్: వేసవిలో బాడీని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడంలో షర్బత్ బాగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో సగం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్ల చక్కెర కలుపుకుని షర్బత్ చేసుకుని తాగొచ్చు.
ఇవి కూడా చదవండి..
Health Tips | రోజూ తప్పకుండా ఈ పని చేయండి.. మీ ఆయుర్దాయాన్ని పెంచుకోండి..
Under Eye Bags | కళ్ల కింద క్యారీ బ్యాగులా? ఇలా మీ నయనాలను అందంగా మార్చుకోండి
Health Tips | కరివేపాకును కూరలో కరివేపాకంటూ తీసిపారేయకండి..!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

