Health Tips | కరివేపాకును కూరలో కరివేపాకంటూ తీసిపారేయకండి..!
Health Tips | కరివేపాకు (Curry leaf)ను వేయడంవల్ల పప్పు, సాంబార్ లాంటి కూరలకు అదనపు రుచి వస్తుంది. ఇక పచ్చి పులుసులో అయితే కరివేపాకు లేకపోతే రుచే ఉండదు. అయితే ఇలా రుచి కోసం కూరల్లో వేసుకునే కరివేపాకును తినడం మాత్రం చాలా మందికి ఇష్టముండదు.
కరివేపాకు (Curry leaf)ను వేయడంవల్ల పప్పు, సాంబార్ లాంటి కూరలకు అదనపు రుచి వస్తుంది. ఇక పచ్చి పులుసులో అయితే కరివేపాకు లేకపోతే రుచే ఉండదు. అయితే ఇలా రుచి కోసం కూరల్లో వేసుకునే కరివేపాకును తినడం మాత్రం చాలా మందికి ఇష్టముండదు. అందుకే కూరలో కరివేపాకు కనిపించగానే దాని ప్రయోజనాలు తెలియక తినకుండా పక్కకు పెడుతారు. అందుకే ఎవరినైనా తక్కువ అంచనా వేసినప్పుడు కూరలో కరివేపాకులా తీసిపారేశారు అంటుంటారు. వాస్తవానికి కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పలు సమస్యలకు అది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అందుకే కూరలో కరివేపాకును అస్సలు తీసిపారేయకూడదంటే దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒకసారి తెలుసుకుందామా..
కరివేపాకుతో ప్రయోజనాలు..
1. కరివేపాకుల (Curry leaves)లో జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉన్నది. అందుకే ఆహారంలో తరచూ కరివేపాకును వాడటంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
2. కరివేపాకు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి లను అందిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల ఆహారంలో కరివేపాకును తరచూ తీసుకుకోవడం ద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చు.
3. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా తోడ్పడుతాయి.
4. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు, కరివేపాకు మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది.
5. కరివేపాకులో మెదడుతోపాటు మన నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడే పదార్థాలు చాలా ఉంటాయి.
6. కరివేపాకుతోపాటు దాని నూనె కూడా ప్రయోజనకారిగా ఉంటుంది. ఇది యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది.
7. కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కరివేపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి పరిష్కారం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Watermelon Seeds | పుచ్చకాయనే కాదు దాని గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి!
Daily Walk | రోజూ 11 నిమిషాలు నడిస్తే చాలు.. ఆ ముప్పు నుంచి బయటపడొచ్చు
పోషకాల బాహుబలి.. అంబలి
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

