Watermelon Seeds | పుచ్చకాయనే కాదు దాని గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి!
Watermelon Seeds | పుచ్చకాయ.. అదేనండి వాటర్ మిలన్.. దీన్ని ఇష్టపడని వారుండరు. ఈ పండే కాదు దీని విత్తనాలు కూడా ఎంతో మేలు చేస్తాయి తెలుసా?... పుచ్చకాయ, దాని విత్తనాలు చేసే మేలుగురించి తెలుసుకోండి
Watermelon Seeds | ఈసారి పుచ్చకాయ తిన్నప్పుడు విత్తనాలు పారేయకండి. ఎందుకంటే, వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు, ఖనిజాలు అనేకం. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అపారం. ఊబకాయాన్ని తగ్గించే గుణమూ ఉంది. పుచ్చవిత్తనాల నూనె చర్మానికి, జుట్టుకు మేలుచేస్తుంది.
పుచ్చ విత్తనాల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటు నివారణకు ఉపయోగపడే ‘సిట్రులేన్’ ఈ విత్తనాల్లో లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పారదోలుతుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ తదితర వ్యాధుల నుంచి రక్షణకు అవసరమైన యాంటీఆక్సిడెంట్లు ఇందులో విరివిగా ఉంటాయి. ఈ విత్తనాల్లోని మెగ్నీషియం రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మగవారిలో సంతానోత్పత్తికి అవసరమైన జింక్ ఖనిజం పుచ్చ విత్తనాల్లో అపారం.
మధుమేహానికి చెక్
పుచ్చ విత్తనాల సారాన్ని మధుమేహంతో బాధపడుతున్న ఎలుకల మీద ప్రయోగించి సత్ఫలితాలు సాధించారు శాస్త్రవేత్తలు. బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధ్యయనంలో పుచ్చ విత్తనాల్లో ఊబకాయాన్ని పోగొట్టే లక్షణాలూ ఉన్నట్టు గుర్తించారు.
కీళ్లవాతాన్ని తగ్గిస్తుంది
ఈ విత్తనాల్లోని మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం వంటివి ఆర్థరైటిస్ నివారణలో మంచి ఫలితాలను ఇస్తాయి. అందులోనూ ఫోలిక్ యాసిడ్ మహిళల్లో సంతానలేమిని దూరం చేస్తుంది. ఇందులోని ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాదు, చర్మం వయసు ప్రభావానికి లోనుకాకుండా చేస్తాయి. పుచ్చవిత్తనాల నూనె చుండ్రును నివారిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

