HomeLifestyleFollowing These Tips Can Help Prevent Furniture From Getting Damaged During The Rainy Season
ఫర్నిచర్ పాడు కాకుండా..
వర్షాకాలంలో ఫర్నిచర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల చెక్క టేబుల్స్, కుర్చీలు, సోఫాలు, అల్మారాలు, మంచాలు ఎక్కువగా దెబ్బతింటాయి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలంలో ఫర్నీచర్ పాడవకుండా చూసుకోవచ్చు.
వర్షాకాలంలో ఫర్నిచర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల చెక్క టేబుల్స్, కుర్చీలు, సోఫాలు, అల్మారాలు, మంచాలు ఎక్కువగా దెబ్బతింటాయి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలంలో ఫర్నీచర్ పాడవకుండా చూసుకోవచ్చు.
అధిక వర్షాలు కురిసినప్పుడు గోడల్లో చెమ్మ వస్తుంది. వాటికి దగ్గరగా ఉండే టేకు మంచాలు, ఇతర ఫర్నిచర్లోకీ ఆ తడి చేరుతుంది. ఫలితంగా.. చెక్క దెబ్బతింటుంది. కాబట్టి, ఈ కాలంలో చెక్క వస్తువులను గోడలకు దూరంగా ఉంచాలి. కనీసం 4 నుంచి 6 అంగుళాల దూరంలో ఉంచితే.. గాలి బాగా ఆడుతుంది. ఫర్నిచర్ దెబ్బతినకుండా ఉంటుంది. తేమను తట్టుకునే వార్నిష్ లేదా సీలెంట్ వేయడం మరీ మేలు.
ఇక గదుల్లో గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. కిటికీలు తెరిచి ఉంచడంతోపాటు ఫ్యాన్లు వేసి గదిలో తేమ స్థాయిని తగ్గించాలి.
చిన్నచిన్న కాటన్ బ్యాగుల్లో ఉప్పు లేదా బొగ్గు ముక్కలను వేసి.. చెక్క అల్మారాలు, డ్రాయర్ మూలల్లో ఉంచాలి. ఇవి గాలిలోని తేమను పీల్చుకుంటాయి. ఫర్నిచర్ పొడిగా ఉండేలా చేస్తాయి.
మంచాలు, సోఫాల ఎత్తును పెంచుకోవాలి. ఇందుకోసం వాటి కాళ్ల కింద ఇటుకలు/ ప్లాస్టిక్ స్పేసర్లు ఏర్పాటుచేయాలి. దీనివల్ల నేల నుంచి వచ్చే తేమతో ఇబ్బంది ఉండదు.
వర్షాకాలంలో చెదపురుగుల బెడద పెరుగుతుంది. కాబట్టి.. ముందే పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి. ఫర్నిచర్‌ను శుభ్రం చేసి, అవసరమైతే మరమ్మతులూ చేసుకోవాలి.
వర్షంలో తడిసిన ఫర్నిచర్‌ను ఎండలో ఆరబెట్టకూడదు. ఎండలో నేరుగా ఉంచితే.. చెక్కలు మరింత దెబ్బతింటాయి. అందుకే, నీడలో ఆరబెట్టడమే మంచిది. ఇక వారానికి రెండుమూడు సార్లయినా.. పొడి మైక్రోఫైబర్ క్లాత్‌తో ఫర్నిచర్‌ను శుభ్రంగా తుడవాలి.