ఆరోగ్యానికి ఆలివ్ నూనె మంచిదని చెబుతారు. కానీ, ధర ఎక్కువ కావడం వల్ల.. వంటల్లో వాడలేని పరిస్థితి. ఆలివ్ పండ్లతోనూ అవే ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్‌తో పోలిస్తే, వీటి ధర తక్కువగా ఉంటుంది. ఆలివ్స్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండెకు మేలుచేసే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల.. ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సాయపడుతాయని పలు సర్వేలు తేల్చాయి. జీర్ణ వ్యవస్థతోపాటు చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.
ఆలివ్స్‌లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఒలీక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి.