న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికగా చిత్రవిచిత్ర ఫుడ్ కాంబినేషన్లతో కూడిన వీడియోలు నెట్టింట సందడి చేస్తూ భోజన ప్రియులను ఇరకాటంలో పడేస్తున్నాయి. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ వీడియోలపై పలువురు నెటిజన్లు పెదవివిరుస్తుండగా కొందరు వాటే కాంబినేషన్ అంటూ లొట్టలేస్తున్నారు. ఇక చాక్లెట్ మోమోస్, మ్యాంగో మ్యాగీ వంటి ఎన్నో ప్రయోగాలకు వంటిల్లు కేంద్రబిందువైన వీడియోలు నెట్టంట వైరలవుతున్నాయి.
ఈ ఫుడ్ కాంబోలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక ఢిల్లీలో లేటెస్ట్గా డోక్లా చాట్ (Dhokla Chaat) అనే ప్రయోగం సోషల్ మీడియా వేదికగా ట్రెండింగవుతోంది. సంప్రదాయ గుజరాతీ డిష్‌కు చాట్ ఫ్లేవర్స్‌ను జోడించారు. డోక్లా చాట్, డెజెర్ట్ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ప్రముఖ ఫుడ్ వ్లాగర్ షేర్ చేశారు.
ఈ వీడియోలో భిన్నమైన కలర్స్‌లో చూడటానికి ఈ డిష్ బాగానే కనిపిస్తోంది. ఈ వీడియోపై ఆన్లైన్లో మిశ్రమ రియాక్షన్స్ వచ్చాయి. డోక్లాను చిదిమేస్తున్న ఢిల్లీ అని కొందరు యూజర్లు రుసరుసలాడారు. ఇక ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఫ్రెష్, సాఫ్ట్, స్పాంజీ డోక్లా అంటూ డిష్ గురించి వ్లాగర్ రాసుకొచ్చాడు.
Read More :
Animal Movie | మీ ఆర్ట్ పెద్ద అబద్ధం.. జావేద్ అక్తర్‌పై యానిమల్ టీమ్ విమర్శలు