చర్మ సౌందర్యానికి కీరా
కీరా దోస.. చర్మ సౌందర్యానికి మెరుగుపెడుతుంది. ఒంటికి నిగారింపు ఇస్తుంది. ఇందులోని నీటిశాతం పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నల్లటి వలయాలు, మచ్చలు తగ్గించడంలోనూ కీరా ఉపయోగపడుతుంది
కీరా దోస.. చర్మ సౌందర్యానికి మెరుగుపెడుతుంది. ఒంటికి నిగారింపు ఇస్తుంది. ఇందులోని నీటిశాతం పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నల్లటి వలయాలు, మచ్చలు తగ్గించడంలోనూ కీరా ఉపయోగపడుతుంది. అంతేనా, యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంచుతుంది. ఈ మూడు పద్ధతులనూ పాటిస్తే ఫలితాలు మరింత బావుంటాయి.
టోనర్: తొక్కతీసిన కీరా ముక్కల్ని మెత్తగా రుబ్బి వడకట్టాలి. ఒక టేబుల్ స్పూన్ కీరా రసానికి అంతే మోతాదులో నిమ్మరసం తీసుకుని బాగా కలిపితే.. టోనర్ సిద్ధం. దీన్ని దూదితో ముఖంపై రాసుకుని.. రెండు నిమిషాలపాటు మర్దన చెయ్యాలి. కళ్లు, ముక్కు, నోటి దగ్గర రాసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగెయ్యాలి. ఈ టోనర్‌ను ఒకేసారి సిద్ధం చేసుకుని ఎయిర్‌టైట్ కంటెయినర్లో పోసి, ఫ్రిజ్‌లోనూ నిల్వ చేసుకోవచ్చు. వారానికి రెండు మూడుసార్లు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
స్క్రబర్: ఓ గిన్నెలో ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కీరా ముక్కతో తీసుకుని ముఖంపై ఒక క్రమ పద్ధతిలో గుండ్రంగా తిప్పుతూ పది నిమిషాలపాటు రుద్దాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ముఖం మీది మృతకణాలు తొలగిపోతాయి.
మాస్క్: ఒక గిన్నె తీసుకుని.. సమపాళ్లలో రోజ్‌వాటర్, కీరా రసం వేసి ఒక టీస్పూన్ ముల్తానీ మట్టి జోడించి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకొని.. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండుసార్లు ఈ మూడు పద్ధతులనూ అనుసరిస్తే ముఖం కాంతిమంతం అవుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

