తెలంగాణా ‘కథా కచ్చీరు’
స్థానికత ఒక బలమైన ధోరణిగా స్థిరపడిన ఈ మూడు దశాబ్దాల కాలంలో.. తెలంగాణ కథ ఎన్నో మలుపులు తిరిగింది. పాతికేళ్లుగా తెలంగాణ కథ అనూహ్యమైన దూరాలకు ప్రయాణించింది. వస్తు వైవిధ్యంతోపాటు, రూప శ్రద్ధనూ పెంచుకుంది. శ్రీధర్ ఈ సంపుటిలో ఉదాహరణగా చూపించిన ప్రతి కథా.. ఇదే విషయాన్ని ఒకటికి పదిసార్లు రుజువు చేస్తుంది. డిజిటల్ పత్రిక ‘సారంగ’లో ‘కథా కచ్చీరు’ శీర్షికన వచ్చిన ఈ వ్యాసాలు ఒక పుస్తకంగా వెలువరించారు. ఇందులోని వ్యాసాలు ఎందరో పాత, కొత్త రచయితల్ని చర్చలోకి తీసుకువచ్చాయి. ‘తెలంగాణ కథలో వస్తువు తప్ప శైలీ, శిల్పం ఉండవు’ అనే విమర్శ ఉంది. ఆ విమర్శ మీద శ్రీధర్ దృష్టి పెట్టాడు.
కథా కచ్చీరులో ఉన్న 72 వ్యాసాల్లో ప్రతి వ్యాసం.. కథన శిల్పాన్ని విడమరిచి చెప్పే ప్రయత్నమే! ఈ వ్యాసాలు పాఠకుల్ని కాలం వెంట పరుగెత్తిస్తాయి. తెలంగాణ చరిత్రలో అనేక దశల మీదుగా వర్తమానంలోకి నడిపిస్తాయి. విమర్శకుడు డాక్టర్ వెల్దండి శ్రీధర్ కథకుడు కావడం వల్ల కథావస్తువు మీదే కాకుండా, రూపం మీద కూడా దృష్టి పెట్టాడు. కాబట్టి, ఈ విశ్లేషణ సమకాలీన కథా విమర్శకులకూ, పరిశోదకులకూ ఒక కరదీపిక. ఆయా జిల్లాల యాసను పట్టుకోవాలన్న రచయితల తపనలోంచి జిల్లాల వారీగా కాథా చరిత్రల మీద కూడా పరిశోధకులు పని చేస్తున్నారు. అయితే, వీటన్నిటినీ ఏకతాటి మీదికి తీసుకురావడం తెలంగాణ కథాశిల్పం మీద కొన్ని మౌలికమైన ప్రతిపాదనలు చేస్తేనే సాధ్యం. శ్రీధర్ ఈ కచ్చీరులో సాధించిన విజయం అదే!
కథా కచ్చీరు
రచయిత: డాక్టర్ వెల్దండి శ్రీధర్
ప్రచురణ: మానేరు రచయితల సంఘం
పేజీలు: 345
ధర: 400
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
మడకెద్దులు
రచన: పి. బాలసుబ్రమణ్యం
పేజీలు: 141
ధర: రూ. 150
ప్రచురణ:చరిత ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 98492 24162
పాత్రికేయ రంగంలో నా అనుభవాలు
రచన: దాసరి ఆళ్వార స్వామి
పేజీలు: 352
ధర: రూ. 450
ప్రచురణ: వనజా గ్రాఫిక్స్
ప్రతులకు:
ఫోన్: 93938 18199
ఎరుపు (అసి కవితలు)
రచన: సింగంపల్లి అశోక్ కుమార్
పేజీలు: 87,
ధర: రూ. 90
ప్రచురణ: ఆలోచన పబ్లికేషన్స్
ప్రతులకు:
ఫోన్: 92462 77375