రష్యన్ భామల బ్యూటీ సీక్రెట్స్!
రష్యా పడతులు.. అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. లేత గులాబీ వర్ణంలో.. అందానికి సరికొత్త నిర్వచనంగా మెరిసిపోతుంటారు.
రష్యా పడతులు.. అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. లేత గులాబీ వర్ణంలో.. అందానికి సరికొత్త నిర్వచనంగా మెరిసిపోతుంటారు. తాజాగా, వీరి బ్యూటీ సీక్రెట్స్‌ను వెల్లడించారు బ్యుటీషియన్లు. రష్యా మహిళల మేనిఛాయ రహస్యాన్ని బయటపెట్టారు.
- చర్మాన్ని శుభ్రపరచడానికి రష్యా మహిళలు ‘బన్యా స్టీమ్‌బాత్’ను ఎక్కువగా ఆశ్రయిస్తారు. ఈ స్టీమ్‌బాత్ వల్ల చర్మ రంధ్రాలు లోతుగా శుభ్రమవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ పురాతన చర్మ సంరక్షణ పద్ధతితో.. మానసిక-శారీరక విశ్రాంతితోపాటు చర్మానికి మెరుపు, ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది.
- ప్లాస్టిక్, రసాయన ఉత్పత్తులకు పూర్తిదూరంగా ఉంటారు. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసేందుకు బిర్చ్/ఓక్ కొమ్మలతో తయారైన స్క్రబ్‌లను ఉపయోగిస్తారు. వీటితో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
- ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే రష్యాలో.. చర్మం పొడిబారుతూ ఉంటుంది. అందుకే, చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్నిరకాల సముద్రపు ఉత్పత్తులు, పొద్దు తిరుగుడు, ఆముదం నూనెను వాడుతారు. వీటిలో చర్మ ఆరోగ్యాన్ని రక్షించే పోషకాలు, వృద్ధాప్య నిరోధక లక్షణాలు ఎక్కువ. అవి చర్మం, జుట్టుకు మంచి హైడ్రేషన్ అందిస్తాయి.
- కోల్డ్ వాటర్ థెరపీ, ఐస్ ఫేషియల్స్‌తో చర్మాన్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌గా ఉంచుకుంటారు. ఈ థెరపీలతో ముఖచర్మం బిగుతుగా మారుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడటంతోపాటు ముడతలూ తగ్గుముఖం పడుతాయి. ఇక కళ్ల కింద వాపును నివారించడంలో కోల్డ్ వాటర్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.
- రష్యన్ల సాంప్రదాయ మాస్క్‌లలో ఎక్కువగా ఉపయోగించే పదార్థాలు.. సోర్ క్రీం, తేనె. వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే ఈ పదార్థాలు.. చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచుతాయి.
- ఇక క్లెన్సర్లుగా పాల ఉత్పత్తులకు ఓటేస్తారు రష్యన్ అమ్మాయిలు. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్.. చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సాయపడుతుంది. చర్మం పీహెచ్ సమతుల్యతను కాపాడటంతోపాటు చర్మ సహజవర్ణాన్ని మెరుగుపరచడంలోనూ ముందుంటుంది.
..ఇలా రసాయన ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడకుండానే రష్యన్ అమ్మాయిలు అందాన్ని కాపాడుకుంటున్నారు. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ.. ‘బ్యూటీ’కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

