e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News Sanjal Gavande : మ‌న అమ్మాయిలు అమెరికాలోనూ అద‌ర‌గొడుతున్నారు

Sanjal Gavande : మ‌న అమ్మాయిలు అమెరికాలోనూ అద‌ర‌గొడుతున్నారు

మ‌న అమ్మాయిలు అద‌ర‌గొడుతున్నారు ! అమెరికా వెళ్లి చ‌రిత్ర సృష్టిస్తున్నారు. మొన్న‌టికి మొన్న వ‌ర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచ‌ర్డ్ బ్రాన్స‌న్‌తో క‌లిసి తెలుగ‌మ్మాయి బండ్ల శిరీష ( Bandla Sirisha ) నింగిలోకి వెళ్లి వ‌స్తే.. ఇప్పుడు అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు, బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంత‌రిక్షంలోకి వెళ్లే ప్రాజెక్టులో మ‌రాఠా యువ‌తి సంజ‌ల్ గ‌వాండే ( Sanjal Gavande )కీల‌క పాత్ర పోషిస్తోంది. అమెరికా అంత‌రిక్ష కేంద్రం నాసా రిజెక్ట్ చేసిన ఈ అమ్మాయి.. బ్లూ ఆరిజిన్ ( Blue Origin ) చేప‌ట్ట‌బోతున్న స్పేస్ టూర్‌ ( Space tour )కు కావాల్సిన వ్యోమ‌నౌక అభివృద్ధి బృందంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Sanjal Gavande : మ‌న అమ్మాయిలు అమెరికాలోనూ అద‌ర‌గొడుతున్నారు

మ‌హారాష్ట్ర‌లోని క‌ల్యాణ్ ప్రాంతంలోని కోల్సెవాడిలో సంజల్ గ‌వాండే ( 30 ) జ‌న్మించింది. ఆమె తండ్రి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఉద్యోగి. ముంబై యూనివ‌ర్సిటీలో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ పూర్తి చేసింది. ఆ త‌ర్వాత మాస్ట‌ర్స్ చ‌దివేందుకు అమెరికా వెళ్లింది. మిచిగాన్ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీలో చేరింది. అంత‌రిక్ష వ్య‌వ‌హారాల‌పై ఆస‌క్తితో ఏరోస్పేస్ సబ్జెక్ట్‌ను ఎంచుకుంది. అందులో ఫ‌స్ట్ క్లాసులో పాసైంది. చ‌దువు పూర్తి కాగానే విస్క‌న్సిస్‌లోని మెర్క్యూరీ మెరైన్ సంస్థ‌లో ఉద్యోగం సంపాదించింది. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు కాలిఫోర్నియాలోని టొయోటా రేసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో చేరారు. ఆ మ‌ధ్య‌లోనే క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ లైసెన్స్ కూడా పొందారు. అంత‌రిక్ష రంగంలో ప‌నిచేయాల‌నే క‌ల‌తో నాసాలో ఉద్యోగానికి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకుంది సంజ‌ల్‌. కానీ పౌర‌స‌త్వ స‌మ‌స్య‌ల కార‌ణంగా సంజ‌ల్‌ను నాసా ఎంపిక చేయ‌లేదు.

Sanjal Gavande : మ‌న అమ్మాయిలు అమెరికాలోనూ అద‌ర‌గొడుతున్నారు
- Advertisement -

ఎలాగైనా త‌న క‌ల‌ను సాకారం చేసుకోవాల‌నే ఆశ‌తో బ్లూ ఆరిజిన్ సంస్థ‌లో సంజ‌ల్ గ‌వాండే సిస్ట‌మ్ ఇంజ‌నీర్‌గా చేరింది. తాజాగా జెఫ్ బెజోస్ స్పేస్ టూర్‌లో భాగ‌స్వామ్యం కావ‌డ‌మే కాకుండా.. న్యూషెప‌ర్డ్ రాకెట్ అభివృద్ధి చేసే బృందంలో కీల‌క పాత్ర పోషించింది. ఈ నెల 20న జెఫ్ బెజోస్ అంత‌రిక్ష‌యానానికి వెళ్తుండ‌టంతో మీడియాతో మాట్లాడిన సంజ‌ల్‌.. త‌న చిన్న‌నాటి క‌ల నెర‌వేరినందుకు సంతోషంగా ఉంద‌ని తెలిపింది. ఒక అమ్మాయి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఎంచుకోవడమేంటని గతంలో చాలామంది తనతో అన్నారని, కానీ ఆమె అందరి అనుమానాలు పటాపంచలు చేసి తాము గర్వపడేలా చేసిందని సంజల్‌ తండ్రి అశోక్‌ గవాండే ఆనందం వ్య‌క్తం చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

అమెరికా కుబేరుల‌కు అంత‌రిక్షంపై అంత మోజెందుకు? స్పేస్ టూరిజం విలువ ఎంత‌?

ఆషాఢంలో ఆడ‌పిల్ల‌లు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?

కార్పొరేట్ కొలువులు.. ల‌గ్జ‌రీ లైఫ్ వ‌దిలేసి అడ‌విలో కాపురం

Pet Passport : శున‌కాల‌కూ పాస్‌పోర్టు ఉంటుంద‌ని తెలుసా !

పేద‌ల‌కు అండ‌గా.. ఒక్క‌డే 100 ఇండ్లు క‌ట్టించి ఇచ్చాడు

వందేండ్లు కాదు.. 130 ఏండ్లు బతుకొచ్చు అంటున్న శాస్త్ర‌వేత్త‌లు.. అదెలా?

కూలి ప‌నులు మాని యూట్యూబ్‌లో ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Sanjal Gavande : మ‌న అమ్మాయిలు అమెరికాలోనూ అద‌ర‌గొడుతున్నారు
Sanjal Gavande : మ‌న అమ్మాయిలు అమెరికాలోనూ అద‌ర‌గొడుతున్నారు
Sanjal Gavande : మ‌న అమ్మాయిలు అమెరికాలోనూ అద‌ర‌గొడుతున్నారు

ట్రెండింగ్‌

Advertisement