Tea History | వందేండ్ల చరిత్ర కలిగిన ఈ టీ కొట్టులో ఎంతటి సెలబ్రెటీ అయినా ఛాయ్ తాగాల్సిందే!
Tea History | ఉష్ణోదక ప్రియులకు తేనీరు అమృత తుల్యం అనడంలో సందేహం లేదు. ప్రతి రోజూ ఆద్యంతాల్లో అంటే తొలి, మలి సంజెల్లో తేనీటిని ఆస్వాదించాల్సిందే. పైగా అమృత తుల్యమైన టీ తాగినప్పుడు కలిగే ఆనందానికి ఆది తప్ప అంతం ఉండదని వారి ముక్తాయింపు. అందుకే కాబోలు పుణెలోని ఓ టీ కొట్టుకు ‘ఆద్య అమృతతుల్య’ పేరు పెట్టుకున్నారు దాని యజమానులు.
Tea History | ఉష్ణోదక ప్రియులకు తేనీరు అమృత తుల్యం అనడంలో సందేహం లేదు. ప్రతి రోజూ ఆద్యంతాల్లో అంటే తొలి, మలి సంజెల్లో తేనీటిని ఆస్వాదించాల్సిందే. పైగా అమృత తుల్యమైన టీ తాగినప్పుడు కలిగే ఆనందానికి ఆది తప్ప అంతం ఉండదని వారి ముక్తాయింపు. అందుకే కాబోలు పుణెలోని ఓ టీ కొట్టుకు ‘ఆద్య అమృతతుల్య’ పేరు పెట్టుకున్నారు దాని యజమానులు. నగరంలోని బుధవార్‌పేట్‌లో ఉన్న ఈ చాయ్ దుకాణానికి ఇంకో ఏడాది పోతే వందేండ్లు నిండుతాయి. 1924లో దీనిని ప్రారంభించిన నాటి నుంచీ నాలుగు తరాలుగా అదే ఆదరణ కొనసాగుతున్నది. స్థానికులను ఆకట్టుకున్న ఈ కొట్టుకు ప్రముఖులూ అభిమానులే. పుణెకు ఏ సెలెబ్రిటీ వచ్చినా ఇక్కడి టీ తాగాల్సిందే.
భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కూడా ‘అమృతతుల్య’ ప్రియుడే! మరాఠా నాయకుడు శరద్ పవార్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఇక్కడి టీ రుచి చూశారని నాలుగో తరానికి చెందిన కొట్టు యజమాని రాహుల్ సగర్వంగా చెబుతుంటాడు. అంతేకాదు, బాలీవుడ్ తారలు ఎందరో ఈ చాయ్‌కి దాసులే! టీ షాపు ఉన్న బుధవార్పేట్లోనే ‘మెలోడీ మేకర్స్’ రికార్డింగ్ సంస్థ ఉండేది. దీంతో ఇక్కడికి పాటల రికార్డింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ నటులు, గాయకులు ‘అమృతతుల్య’లో ఓ టీ తాగి రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్లేవాళ్లు. అలా షమ్మీకపూర్, జానీవాకర్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ తదితర ప్రముఖులు వచ్చేవారని యజమాని కథలు కథలుగా చెబుతాడు. ‘మా ముత్తాత అప్పట్లో బంగు (గుడుంబా) దుకాణం నడిపేవాడు. అనుబంధంగా టీ కొట్టూ ఉండేది. 1924లో గంజాయిపై పూర్తిస్థాయి నిషేధం విధించడంతో దానిని మానేసి తేనీటి దుకాణం ప్రారంభించాడు. అప్పటి నుంచి మా దుకాణం రోజూ తేనీటి ప్రియులతో కళకళలాడుతూనే ఉంది’ అంటాడు రాహుల్.
వెనీలా టీ
కావలసినవి: వేడినీళ్లు: ఒక కప్పు, ఆరెంజ్ పికో టీ బ్యాగ్: ఒకటి, వేడి పాలు: పావుకప్పు, చక్కెర: ఒక టేబుల్ స్పూన్, వెనీలా కాడ: అంగుళం, దాల్చిన చెక్క: అర అంగుళం ముక్క
తయారీ: వేడినీటిని ఒక మగ్‌లో పోసుకోవాలి. టీ బ్యాగ్ అందులో వేసి మూడు నిమిషాలపాటు ఆడించి తీసేయాలి. తర్వాత మగ్‌లో పాలుపోసి చక్కెర, వెనీలా కాడ, దాల్చిన చెక్క వేసి కలపాలి. మరోగ్లాసులోకి వడగట్టుకుంటే వెనీలా టీ రెడీ! టీ చల్లారితే నచ్చని వాళ్లు రెండు నిమిషాలు పొయ్యిమీద వేడి చేసుకోవచ్చు.
టీకా తాత్పర్యం
ఉదయం తేనీటి కప్పు అందుకోగానే.. నిన్న కరిగిపోయిన ఆశలు మళ్లీ పురుడు పోసుకుంటాయి.
హెన్రీ డుమాస్, ఆంగ్ల రచయిత
Read More :
Mustache Tea Cup | మీసాల రాయుళ్ల కోసమే స్పెషల్ టీకప్పులు.. 18వ శతాబ్దంలో ఇవో సంచలనం!
Tea Tales | ఆడీ కారులో ఛాయ్ అమ్ముతున్న యువకులు.. త్వరలోనే బెంజ్ కారులో కూడా విక్రయిస్తారట!
Tea History | చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

