Mustache Tea Cup | మీసాల రాయుళ్ల కోసమే స్పెషల్ టీకప్పులు.. 18వ శతాబ్దంలో ఇవో సంచలనం!
Mustache Tea Cup | నూనూగు మీసాలు నూత్న యవ్వనానికి ప్రతీకలు. గుబురు మీసం గుబులు పుట్టిస్తే.. కోర మీసం కోరికలు రేపుతుంది. ‘మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు గగన మండలమందు కాలుదువ్వు’ అని మీసం మీద మహాకవి శ్రీశ్రీ విసిరిన సీస పద్యంలోని ఈ పాదం మూంఛ్ ఊంచాయీని వెలిబుచ్చుతుంది.
Mustache Tea Cup | నూనూగు మీసాలు నూత్న యవ్వనానికి ప్రతీకలు. గుబురు మీసం గుబులు పుట్టిస్తే.. కోర మీసం కోరికలు రేపుతుంది. ‘మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు గగన మండలమందు కాలుదువ్వు’ అని మీసం మీద మహాకవి శ్రీశ్రీ విసిరిన సీస పద్యంలోని ఈ పాదం మూంఛ్ ఊంచాయీని వెలిబుచ్చుతుంది. తేనీటి కథలంటూ.. ఈ మీసాల గోలేంటి గోపాలా? అంటారేమో! మెలి తిరిగిన మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టినంత వీజీ కాదు… సదరు మీసాల రాయుళ్లు టీ తాగడం! సంపెంగ నూనెతో పెంచి పోషించిన ఒత్తయిన మీసాలను తేనీటి సేవన వేళ కాపాడుకోవడం సవాలే! అందుకే, మీసాల బాబులను ఈ కష్టం నుంచి గట్టెక్కించేందుకు 18వ శతాబ్ది చివర్లో ముస్టాచ్ టీ కప్పులు అందుబాటులోకి వచ్చాయి.
ఆ రోజుల్లో మగరాయుళ్లు మీసాలను పరపతికి చిహ్నంగా భావించేవాళ్లు. అవి మెరిసిపోయేలా రంగులూ అద్దేవాళ్లు. మైనం రుద్ది మీసాల కొసలను కొడవళ్లలా నిలబెట్టేవాళ్లు. అలా మీసకట్టుతో కనికట్టు చేసే దొరబాబులు టీ అంటే గజగజ వణికిపోయేవాళ్లు. కప్పులోని తేనీరు తగిలితే మీసాల నిగారింపు నీరుగారిపోతుందన్నది వాళ్ల భయం! ఈ అసౌకర్యాన్ని అర్థం చేసుకున్న హార్వే ఆడమ్స్ అనే కుమ్మరి టీ కప్పులో పెద్ద మార్పునే తీసుకొచ్చాడు. మీసాలు టీని తాకకుండా, కప్పు లోపల పైభాగంలో ఒక ప్రత్యేక నిర్మాణం చేశాడు. టీ తాగుతూ కప్పు పైకి అన్నా.. అడ్డుగా ఉన్న నిర్మాణం మీసాలను అదిమిపట్టేది! ఆ అడ్డంకి మధ్యలో ఉన్న చిన్న మార్గం ద్వారా తేనీరు సులభంగా నోటికందేది. ఇంకేముంది ముస్టాచ్ టీ కప్పులకు గిరాకీ అమాంతం పెరిగింది. లండన్‌లో మొదలైన ఈ టీ కప్పుల అలజడి.. యూరప్ అంతా వినిపించి, అమెరికాకూ చేరుకుంది. 1910 వరకు వీటికి ఆదరణ కొనసాగింది. ఆ తర్వాత సేఫ్టీ రేజర్ (షేవింగ్ కిట్)ను సొంతంగా ఉపయోగించుకునేలా అనేక మార్పులు చోటుచేసుకోవడంతో మోవిపై ముసరకుండా మీసాలకు కోతలు పడ్డాయి. ముస్టాచ్ టీ కప్పుల వినియోగం గణనీయంగా తగ్గింది. ఆన్లైన్ అంగట్లో ఇంకా ఈ కప్పులు అందుబాటులో ఉన్నాయి.
టీకా తాత్పర్యం
తేనీరు ఆత్మను, శరీరాన్ని సమన్వయం చేస్తుంది. అలసటను తొలగిస్తుంది. ఆలోచనలను పురిగొల్పుతుంది.
లు జీ, చైనా గురువు
మేట్ టీ
నార్త్ అమెరికాలో హెర్బ్ మేట్ మొక్కలు పెరుగుతాయి. తేయాకు జాతికి చెందని ఈ మొక్కల ఆకుల్లో కెఫీన్ ఉండటంతో ఉష్ణోదకం తయారీలో వీటిని వినియోగిస్తుంటారు. మేట్ టీ పొడి ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతుంది. దీంతో ఉష్ణోదకం తయారీకి మేట్ గార్డ్ పేరుతో ప్రత్యేక కప్ కూడా ఉంటుంది. చేయాల్సిందలా ఈ కప్పులో మేట్ పొడి లేదా ఆకులు వేసి.. సరిపడా నీళ్లు పోసి బాగా షేక్ చేయాలి. కాసేపయ్యాక స్ట్రా లాంటి గొట్టంతో ఆ ద్రావణాన్ని జుర్రుకోవడమే! రోగనిరోధక శక్తిని పెంచడంలో మేట్ టీ మేటిగా పని చేస్తుందట.
Read More :
Tea Tales | ఆడీ కారులో ఛాయ్ అమ్ముతున్న యువకులు.. త్వరలోనే బెంజ్ కారులో కూడా విక్రయిస్తారట!
Tea History | చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

