Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Tea History | గల్లీ లెవల్లో సింగిల్ టీ కోసం బాహాబాహీకి దిగే సన్నివేశాలు మనం చూస్తుంటాం! ఢిల్లీ లెవల్లో మొగలుల నాటి పానిపట్ యుద్ధాల గురించి చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకున్నాం! పరోక్షంగా తేయాకు కోసం రెండు రాజ్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వైనం చరిత్ర పుటల్లో ఇంకా మసాలా టీ అంత ఘాటుగా, ఇరానీ చాయంత చిక్కగా దాక్కొని ఉంది.
Tea History | గల్లీ లెవల్లో సింగిల్ టీ కోసం బాహాబాహీకి దిగే సన్నివేశాలు మనం చూస్తుంటాం! ఢిల్లీ లెవల్లో మొగలుల నాటి పానిపట్ యుద్ధాల గురించి చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకున్నాం! పరోక్షంగా తేయాకు కోసం రెండు రాజ్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వైనం చరిత్ర పుటల్లో ఇంకా మసాలా టీ అంత ఘాటుగా, ఇరానీ చాయంత చిక్కగా దాక్కొని ఉంది. 19వ శతాబ్దిలో యునైటెడ్ కింగ్డమ్కు చైనా నుంచి తేయాకు ఎగుమతులు జోరుగా సాగేవి. దీంతోపాటు పట్టుదుస్తులు, పింగాణీ వస్తువులు కూడా ఇంగ్లండ్‌కు పంపేవాళ్లు చైనీయులు. వీటికి ప్రతిగా మరేదైనా వస్తువులు దిగుమతి చేసుకోవాలని కోరినా ఒప్పుకోకుండా వెండినాణేలను ప్రతిగ్రహించేవాళ్లు.
ఏండ్లు గడిచేసరికి యూకేలో వెండి నిల్వలు పడిపోయాయి. బొక్కసంలోని వెండి అంతా మంచుకొండలా కరిగిపోసాగింది. ఇలాగే ఉపేక్షిస్తే.. తమ దేశం దివాలా తీస్తుందని భావించిన ఆంగ్లేయులు కుయుక్తితో ‘నల్లమందు’ గుండును చైనాపై ప్రయోగించారు. తమ ఏలికలో ఉన్న భారతదేశంతోపాటు ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల్లో నల్లమందు పండించి చైనాలో దొంగచాటుగా అమ్మడం మొదలుపెట్టారు. లక్షలాది మంది మత్తుపదార్థాలకు బానిసై నాలుగింతల వెండి నాణేలు సమర్పించి మరీ నల్లమందు కొనుగోలు చేసేవారు. అలా వసూలైన వెండినాణేలు ఇచ్చి మళ్లీ తేయాకు దిగుమతి చేసుకునేవారు.
ఇలా ఆంగ్లేయుల ఎత్తు పారడంతో తలపట్టుకున్న చైనా పాలకులు ఇంగ్లండ్‌తో తాడోపేడో తేల్చుకోవాలని భావించారు. దాదాపు మూడేండ్లపాటు ఇరుదేశాల మధ్య ఓ మోస్తరు యుద్ధమే సాగింది. వందల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 1839-42 మధ్య జరిగిన ఈ సమరం మొదటి ఓపియమ్ యుద్ధంగా చరిత్రలో చోటు దక్కించుకుంది. చివరికి కొన్ని ఒప్పందాల తర్వాత యుద్ధం సమసిపోయింది.
రాయ్బాస్ టీ
కావలసినవి: రాయ్బాస్ టీపొడి (ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతుంది): 1 టీ స్పూన్, నీళ్లు: ఒక కప్పు, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, తేనె: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. టీ పొడి వేసి మరో రెండు నిమిషాలు సన్నని మంట మీద వేడి చేయాలి. కప్పులో నిమ్మరసం, తేనె వేసి అందులోకి టీని వడకట్టుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న రాయ్బాస్ టీ తాగడం వల్ల ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మ సంబంధమైన ఎలర్జీలు తగ్గుముఖం పడతాయి.
‘టీ’కా తాత్పర్యం
ఆత్మ పరిశీలనకు అనువైన వేళ తేనీరు ఆస్వాదించే సమయమే!
లెటీషా బాల్రిడ్జ్ అమెరికన్ రచయిత్రి
Read More :
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Tea History | తేయాకు తోటలను కాపాడుకునేందుకు చైనీయులు అంతలా కష్టపడ్డారా?
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- china
- Opium War
- tea
- tea culture
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

