Tea History | బుద్ధుడికి ఛాయ్‌కి ఉన్న సంబంధమేంటి? బౌద్ధ భిక్షువులు టీ తాగడం వెననుక అంత పెద్ద కథ ఉందా?
Tea History | ప్రపంచంలో తేనీటి ప్రేమికులు కోకొల్లలు. కూటికి గతిలేని నిరుపేద నుంచి, కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడి వరకు టీ లవర్సే! ఆశామోహాలను దరి రానీయకుండా, అన్యులకోసమే జీవితాన్ని త్యాగం చేసే తపోధనులూ ఉష్ణోదక ఆరాధకులే! ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఏకాక్షరి సాధనలో తరాలుగా తరిస్తూనే ఉన్నారు.
Tea History | ప్రపంచంలో తేనీటి ప్రేమికులు కోకొల్లలు. కూటికి గతిలేని నిరుపేద నుంచి, కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడి వరకు టీ లవర్సే! ఆశామోహాలను దరి రానీయకుండా, అన్యులకోసమే జీవితాన్ని త్యాగం చేసే తపోధనులూ ఉష్ణోదక ఆరాధకులే! ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఏకాక్షరి సాధనలో తరాలుగా తరిస్తూనే ఉన్నారు. తత్వ సాధనలో, సత్య శోధనలో టీని ప్రాణంగా భావిస్తారు బౌద్ధ సన్యాసులు. ధ్యానంపై మనసు లగ్నం కావడానికి అడపాదడపా చాయ్ పుచ్చుకోవడం పరిపాటే! అదేదో వాళ్ల జిహ్వ చాపల్యం అనుకుంటే మన పొరపాటే! బుద్ధుడి అనుగ్రహం వల్లే తేయాకు పుట్టిందని నమ్మేవాళ్లూ ఉన్నారు. దీనిని బలపరిచేలా చైనా, టిబెట్ బౌద్ధ ఆరామాల్లో ఓ కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది.
జ్ఞానోదయం కోసం తపస్సులో ఉన్న గౌతముడికి తరచూ నిద్రావస్థ ఆవహించేదట! దీంతో ధ్యానం భగ్నం అయ్యేదట. ఈ నిద్ర వల్ల మనసును లగ్నం చేయలేకపోతున్నానని అసహనానికి గురయ్యాడట బుద్ధుడు. నిద్ర ఆవహించకుండా ఉండేందుకు తన కనురెప్పలను కత్తిరించి విసిరేశాడట. కొన్నాళ్లకు ఆ కనురెప్పల నుంచి తేయాకు మొక్కలు మొలిచాయని కొందరి విశ్వాసం. ఆ తేయాకు మొక్కలే తర్వాతి కాలంలో టీ తోటలు విస్తృతం కావడానికి మూలమని చెబుతారు. బుద్ధుడి ప్రసాదంగా జన్మించిన తేయాకును భిక్షువులు అమితంగా ఇష్టపడతారు. సాధన క్రమంలో తేయాకుతో కాచి, వడబోసిన తేనీటిని నిత్యం ఆస్వాదిస్తారు. ప్రత్యేక మూలికలతో టీ తయారు చేసి, సేవించి ఉత్తేజిత మనసుతో ధ్యానానికి ఉపక్రమిస్తారు. ఇప్పటికీ బౌద్ధ ఆరామాలకు వెళ్తే పింగాణీ పాత్రల్లో వేడివేడి టీ సదా సిద్ధంగా ఉండటం గమనించవచ్చు. బౌద్ధ సన్యాసులు మాత్రమే కాదు, మన దగ్గరి కాషాయాంబరధారులు కూడా పచనం చేసిన అన్నిరకాల ఆహారపదార్థాలను త్యజించినా టీ విషయంలో మాత్రం షరతులు వర్తించకుండా జాగ్రత్తపడుతున్నారు. అదీ మరి టీ మహిమ!
మసాలా టీ
కావలసినవి: నీళ్లు: ఒకటిన్నర కప్పు, పాలు: రెండు కప్పులు, టీ పొడి– మూడు టీస్పూన్లు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, మసాలా: ఒక టీస్పూన్ (రెండు లవంగాలు, నాలుగు మిరియాలు, రెండు యాలకులు, అర అంగుళం దాల్చిన చెక్క, అర అంగుళం అల్లం కలిపి బాగా దంచుకొని పొడిగా చేసుకోవాలి.)
తయారీ: స్టౌ మీద గిన్నె పెట్టి నీటిని మరిగించాలి. అందులో టీ పొడి, చక్కెర, మసాలా పొడి వేయాలి. బాగా మరిగిన తర్వాత పాలు పోయాలి. రెండు నిమిషాలపాటు సన్నని మంటపై మరిగించి.. గ్లాస్‌లోకి వడగట్టుకోవాలి.
‘టీ’కా తాత్పర్యం
భవిష్యత్తు గురించి బెంగలేకుండా, ఈ క్షణాన్ని సలక్షణంగా అనుభవించడానికి ఉన్న ఒకానొక మార్గం.. రుచికరమైన తేనీటిని నిదానంగా ఆస్వాదించడమే!
– బుద్ధిజం నానుడి
Read More :
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Tea History | తేయాకు తోటలను కాపాడుకునేందుకు చైనీయులు అంతలా కష్టపడ్డారా?
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- tea
- tea culture
- Tea History
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

