Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Tea | ‘నేనెక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు’ అన్నాడు కవి ఆరుద్ర! ఆయన అనుకున్న ఆ రైలేదో సరైన సమయానికి వచ్చి ఉండి, అది ఆయన ఎక్కి, ఆపై ప్రయాణంలో బోగీలోకి అమ్మొచ్చిన తేనీటి చుక్క రుచి చూసి ఉంటే ఈ కూనలమ్మ కవి ‘రైలు ప్రయాణం జీవితకాలం గ్రేటు’ అని ప్రయోగం చేసేవాడేమో!
Tea | ‘నేనెక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు’ అన్నాడు కవి ఆరుద్ర! ఆయన అనుకున్న ఆ రైలేదో సరైన సమయానికి వచ్చి ఉండి, అది ఆయన ఎక్కి, ఆపై ప్రయాణంలో బోగీలోకి అమ్మొచ్చిన తేనీటి చుక్క రుచి చూసి ఉంటే ఈ కూనలమ్మ కవి ‘రైలు ప్రయాణం జీవితకాలం గ్రేటు’ అని ప్రయోగం చేసేవాడేమో! మనసు ఉండాలే కానీ, ప్రతి రైలు ప్రయాణం ఓ మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఓ ప్రయాణంలో ఆచారాలు పాటించే బామ్మను బురిడీ కొట్టించి పచారీ కొట్టు పకోడీ తినిపించే తుంటరి మనవడు తారసపడొచ్చు. ఓ కవిగారికి తను చెప్పిందానికల్లా ‘వహ్వా’ అనే మంచి శ్రోత దొరకొచ్చు. పఠనాసక్తి ఉన్న నడివయస్కుడికి ఒకట్రెండు దినపత్రికలూ ప్రాప్తించవచ్చు. ఆర్ఏసీ రూపంలో దురదృష్టం వెంటాడొచ్చు. అంతలోనే తను సీటు షేరింగ్ చేసుకోవాల్సింది ఆల్చిప్పల్లాంటి కండ్లేసుకొని టీసీ పక్కనే అమాయకంగా నిల్చున్న ఇందువదనతో అని తెలిసి అదృష్టంగా భావించొచ్చు. ఇందరి వ్యాపకాలను, ఆలోచనలనూ కాసేపు పక్కన పెట్టించే ఘనత మాత్రం ఒక్క తేనీటికే ఉంది.
‘గరమ్ చాయ్’ అన్న పిలుపు చెవిన పడగానే పేకలు ఆడుతున్న జట్టు టీ డ్రాప్ గొంతున పడేవరకు మిడిల్ డ్రాప్ చేసి వేచి చూస్తుంది. అప్పటివరకూ ప్రపంచాన్ని మర్చిపోయి పుస్తకంలోకి దూరిన చదువరి తేనీటిరాయుడి పిలుపు విని చటుక్కున పుస్తకం పక్కన పెట్టేస్తాడు. రైళ్లలో దొరికే సాదాసీదా ఉష్ణోదకానికే ఇంతలా ఇదైపోతే.. కొన్ని రైల్వే స్టేషన్లలో టీ ప్రత్యేకం. అక్కడ రైలు ఆగిన మరుక్షణం టీ కోసం ప్రయాణికులు ఎగబడతారు. రైలు నిలిచిన రెండు నిమిషాల్లో రెండు వందల చాయ్‌లు అమ్ముడైపోతాయి. పోటాపోటీగా టీ అందుకునే క్రమంలో దుస్తులు చించేసుకునే సన్నివేశాలూ కంటపడతాయి. రైలు మిస్ చేసుకున్న సందర్భాలూ తెలియవస్తాయి. అంతలా వెంపర్లాడే టీ మా ప్రయాణాల్లో ఎక్కడా తారసపడలేదు అంటారా? అయితే ఈసారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్, బాసర వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అక్కన్నపేట రైల్వే స్టేషన్లో టీ టేస్ట్ చేయండి. పై ఉదంతాలు సమంజసమైనవనే అనిపిస్తాయి!
మందారం టీ
కావలసినవి: ఎండబెట్టిన ఎర్ర మందారం పూలరెక్కలు: ఆరు, నీళ్లు: ఒకటిన్నర కప్పు, తేనె: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: ఒక టీస్పూన్
తయారీ: స్టౌ మీద గిన్నె ఉంచి, నీళ్లను బాగా కాగబెట్టాలి. అందులో మందారం రెక్కలు వేసి నిమిషం మరిగించాలి. ఇంకోవైపు గ్లాసులో తేనె, నిమ్మరసం వేసుకోవాలి. మరిగిన మందారం నీళ్లను గ్లాస్‌లోకి వడగట్టుకుంటే మందారం టీ రెడీ! ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
‘టీ’కా తాత్పర్యం
పరిపూర్ణమైన ప్రయాణం తేనీటి ఆస్వాదనతో పూర్తవుతుంది.
– జపాన్ నానుడి
Read More :
Tea History | తేయాకు తోటలను కాపాడుకునేందుకు చైనీయులు అంతలా కష్టపడ్డారా?
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- hibiscus tea
- tea
- Tea History
RELATED ARTICLES
తాజా వార్తలు
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

