Tea Tales | ఆడీ కారులో ఛాయ్ అమ్ముతున్న యువకులు.. త్వరలోనే బెంజ్ కారులో కూడా విక్రయిస్తారట!
Tea Tales | తేనీరు విక్రయించి లక్షలు సంపాదించిన వాళ్లను చూసుంటాం. లక్షాధికారులు తిరిగే ఆడీ కారులో టీ అమ్ముతున్న వైనాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ చిత్రం చూడాలంటే.. ముంబయిలోని లోఖండ్వాలా బ్యాక్రోడ్లో రెండు చక్కర్లు కొట్టాలి. అక్కడ దారి పక్కన ఓ తెల్లరంగు ఆడీ కారు కనిపిస్తుంది.
Tea Tales | తేనీరు విక్రయించి లక్షలు సంపాదించిన వాళ్లను చూసుంటాం. లక్షాధికారులు తిరిగే ఆడీ కారులో టీ అమ్ముతున్న వైనాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ చిత్రం చూడాలంటే.. ముంబయిలోని లోఖండ్వాలా బ్యాక్రోడ్లో రెండు చక్కర్లు కొట్టాలి. అక్కడ దారి పక్కన ఓ తెల్లరంగు ఆడీ కారు కనిపిస్తుంది. దాని చుట్టూ టీ లవర్స్ మూగి ఉంటారు. అందరి చేతుల్లో టీ కప్పులు ఉంటాయి. తళుక్కుమని మెరిసిపోతున్న కారు వంక కన్నార్పకుండా చూస్తూ.. తేనీటిని ఆస్వాదిస్తుంటారు. ఆడీ కారులో తయారుచేసిన తేనీరు తాగుతున్నానన్న గర్వం ఒకరిద్దరిలో స్పష్టంగా కనిపిస్తుంది కూడా! ఈ కారు యజమానులు మను శర్మ, అమిత్ కశ్యప్‌లో మాత్రం గర్వం అణువంతైనా కనిపించదు.
ఉదయాన్నే ఇద్దరూ మెరుపు వేగంతో లోఖండ్‌వాలాకు దూసుకొస్తారు. వచ్చీరాగానే డిక్కీ తెరిచి సరంజామా అంతా బయట సర్దుకుంటారు. క్షణాల మీద చక్కటి, చిక్కటి టీ తయారుచేసి ఫ్లాస్క్‌లో పోసి సిద్ధంగా ఉంచుతారు. అప్పటికే పాతిక మందికిపైగా టీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. టీ టేస్ట్ చేసిన తర్వాత ఆ పాతికలో కనీసం పదిమంది అప్పటికప్పుడు ఇంకో టీ ఆర్డర్ ఇస్తారు. ఇలా రాత్రి వరకు టీ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ‘ఓడీ టీ- ఆన్ రోడ్ టీ’ పేరుతో ఆడీని చాయ్ అడ్డాగా మార్చేశారు. ఈ వింత టీ స్టాల్‌కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉందండోయ్! ఇక్కడ టీ తాగడానికి వచ్చిన ముంబైకర్లు ఆడీ టీ ఓనర్స్ మను, అమిత్‌తో రీల్స్, షార్ట్ వీడియోలు తీసి ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో అప్లోడ్ చేస్తున్నారు. వాటికి విపరీతంగా మైలేజ్ వస్తున్నది. ‘సచ్ కడ్వా హై’ ఇన్‌స్టా హ్యాండిల్లో అప్లోడ్ చేసిన ‘ఆడీ- ఓడీ టీ’ రీల్ తెగ వైరల్ అయింది. లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంది. ‘ఆన్ డ్రైవ్ టీ’ కూడా సెల్ఫ్ ఇన్‌స్టా అకౌంట్ నిర్వహిస్తున్నది. ‘థింక్ లగ్జరీ.. డ్రింక్ లగ్జరీ’ అంటూ తమ చాయ్ గొప్పదనాన్ని ప్రచారం చేస్తున్నారు అమిత్, మను. త్వరలోనే బెంజ్ కార్ టీ స్టాల్‌ను రోడ్డెక్కించి తమ వ్యాపారాన్ని మరింత పెంచుతామని చెబుతున్నారు ఈ ఆడీ చాయ్వాలాలు!
సన్ టీ
కావాల్సినవి:
నీళ్లు పావు లీటరు, టీ బ్యాగ్స్: నాలుగు, తేనె: రెండు టేబుల్ స్పూన్లు (ఒక కప్పు కోసం), ఐస్ క్యూబ్స్: రెండు (ఒక కప్పు కోసం)
తయారీ: గాజు జార్లో నీళ్లు పోసి, టీ బ్యాగ్‌లు వేసి ఐదు గంటలపాటు ఎండలో ఉంచాలి. తర్వాత టీ బ్యాగ్‌లు తొలగించి.. డికాక్షన్ జార్‌ను ఫ్రిజ్‌లో ఉంచాలి. రెండు గంటల తర్వాత ఒక గ్లాసులో తేనె వేసుకొని అందులోకి డికాక్షన్ పోసుకోవాలి. చివరిగా ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సన్ టీ సిద్ధం!
టీకా తాత్పర్యం
టీ ఆస్వాదించడం కళాత్మకంగా ఉండాలి. చిక్కటి టీని సలక్షణంగా అనుభవించాలి. అప్పుడు ప్రతి గుటకలో ఓ కొత్త రుచి తొంగి చూస్తుంది!
– చైనా నానుడి
Read More :
Tea History | చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- tea
- tea culture
- tea tales
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

