Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea | ‘పత్రం, పుష్పం, ఫలం, నీరు.. ఏదైనా భక్తితో తనకు సమర్పిస్తే దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను’ అన్నాడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ! వీటికి అదనంగా తేనీరు కూడా జతచేర్చారు కేరళీయులు. పరమాత్మకు నివేదించిన ఉష్ణోదకాన్ని ఆ గుడికి వచ్చేవారందరికీ ప్రసాదంగా పంచుతుంటారు.
Tea | ‘పత్రం, పుష్పం, ఫలం, నీరు.. ఏదైనా భక్తితో తనకు సమర్పిస్తే దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను’ అన్నాడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ! వీటికి అదనంగా తేనీరు కూడా జతచేర్చారు కేరళీయులు. పరమాత్మకు నివేదించిన ఉష్ణోదకాన్ని ఆ గుడికి వచ్చేవారందరికీ ప్రసాదంగా పంచుతుంటారు. ఏకాక్షరికి ఇంతటి ఘనత కట్టబెట్టిన ఆలయం పేరు ముత్తప్పన్ కోవెల! కేరళలోని కన్నూరు జిల్లా పరాసినిక్కడవు గ్రామంలో ఉంటుందీ గుడి. ఇక్కడ వెలసిన ముత్తప్పన్ ఆదివాసీల ఆరాధ్య దైవం. హరిహరుల అంశగా ఈ స్వామిని కొలుస్తారు. ముత్తప్పన్‌ను అయ్యప్పగా భావిస్తారు కొందరు.
ఉత్తర మలబారులో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న పరాసినిక్కడవులో ముత్తప్పన్ ఆలయం మరింత ప్రత్యేకం. ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయిక్కడ. అందులో పాలుపంచుకోవడానికి కేరళ నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు అక్కడికి వస్తుంటారు. ఈ సంగతి పక్కనపెడితే, ఇక్కడ తేనీటిని నైవేద్యంగా సమర్పించడం, ప్రసాదంగా భక్తులకు పంచడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నదని స్థానికుల ఉవాచ!
తేనీటితోపాటు పెసర సొండెలు ప్రసాదంగా అందిస్తారు. వినడానికి వింతగా ఉన్నా.. నేటికీ ఇక్కడ తేనీరే ప్రసాదం. ఆ మాటకొస్తే ఉదయం పూట కాచే తొలి టీని దేవుడి పటం ముందుంచి నైవేద్యం పెట్టే కుటుంబాలు మన దగ్గరా కనిపిస్తాయి. ‘ఈ ఉష్ణోదకం ముందు అమృతం కూడా దిగదుడుపే! అందుకే టీ నివేదనం’ అంటారు తేనీటి ప్రేమికులు. ఏదైతేనేం, ఈసారి కేరళ పర్యటనకు వెళ్లినప్పుడు ముత్తప్పన్ ఆలయాన్ని సందర్శించి తేనీటి ప్రసాదాన్ని రుచి చూడండి!!
కుంకుమ పువ్వు టీ
కావలసినవి: పాలు: రెండు కప్పులు, నీళ్లు: రెండు కప్పులు, టీ పొడి: 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు: చిటికెడు, యాలకులు: 3 దంచుకోవాలి, దాల్చిన చెక్క: పావు అంగుళం, లవంగం: ఒకటి
తయారీ: ముందుగా గిన్నెలో పాలను తీసుకొని, కుంకుమ పువ్వు రేకలు వేసి బాగా కలుపుకోవాలి. పాలు చిక్కగా అయ్యేవరకు మరిగించుకోవాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగం వేసుకొని రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి. తర్వాత టీ పొడి వేసి మరో మూడు నిమిషాలపాటు తక్కువ మంటమీద ఉంచాలి. కాగుతున్న డికాక్షన్లో కుంకుమ పువ్వు కలిపిన పాలను పోసి మూడు పొంగులు వచ్చేవరకు మరిగించాలి. చివరిగా కప్పులోకి వడగట్టుకుంటే కుంకుమ పువ్వు టీ సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
తేయాకు వెలుగు చూడకముందు ఈ ప్రపంచం ఎలా ఉండేదో? తేనీరు కనుగొన్న తర్వాత జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను!
సిడ్నీ స్మిత్, ఓ ఆంగ్ల రచయిత
Read More :
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Tea History | తేయాకు తోటలను కాపాడుకునేందుకు చైనీయులు అంతలా కష్టపడ్డారా?
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

