Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!
Tea History | చైనాలో తేయాకు ప్రస్థానం క్రీస్తుపూర్వమే మొదలైనా.. జపాన్‌కు పరిచయమైంది మాత్రం క్రీస్తుశకం 200 ప్రాంతంలోనే! జపనీయులు టీ జపంలో తరించడానికి కారణం ఓ బౌద్ధ భిక్షువు. చరిత్రను పరిశీలిస్తే ఆ బౌద్ధ భిక్షువు పేరు రకరకాలుగా కనిపిస్తుంది.
Tea History | చైనాలో తేయాకు ప్రస్థానం క్రీస్తుపూర్వమే మొదలైనా.. జపాన్‌కు పరిచయమైంది మాత్రం క్రీస్తుశకం 200 ప్రాంతంలోనే! జపనీయులు టీ జపంలో తరించడానికి కారణం ఓ బౌద్ధ భిక్షువు. చరిత్రను పరిశీలిస్తే ఆ బౌద్ధ భిక్షువు పేరు రకరకాలుగా కనిపిస్తుంది. ఏ పేరైతేనేం విద్యాభ్యాసం కోసం ఆయన చైనాకు వెళ్లాడు. రెండేండ్ల పాటు అక్కడి ఆరామంలో విద్యాభ్యాసం గావించాడు. చదివిన విద్యకు పట్టా పుచ్చుకొని వస్తూవస్తూ తనతోపాటు చైనా నుంచి తేయాకు విత్తనాలు కొన్ని తీసుకొచ్చాడు. వాటిని తన ఆరామం ప్రాంగణంలో నాటి జాగ్రత్తగా పెంచడం మొదలుపెట్టాడు. ఐదేండ్లు గడిచాయి. తేయాకు మొక్కలు అంతెత్తు ఎదిగాయి. నవనవలాడుతున్న తేయాకు దళాలను తుంచి చిక్కటి టీ కాచి పసందుగా ఆస్వాదించాడు భిక్షువు.
సంచినిండా తేయాకు తీసుకొని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజుకూ చక్కటి తేనీరు కాచి ఇచ్చాడు. ఆ రాజుగారూ సరికొత్త రుచికి ఫిదా అయ్యాడు. సదరు పానీయం పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకొని.. దేశంలోని అనువైన చోట తేయాకు పండించాలని ఉత్తర్వులు జారీ చేశాడు. దరిమిలా జపాన్‌లో టీకి ఠికాణా దొరికినట్టయింది. ఆ దేశంలోని కగోషిమా, షిజుకా, ఉజి మొదలైన ప్రాంతాల్లో తేయాకు తోటలు పురుడు పోసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించినా.. నేటికీ జపాన్‌లో ఉత్పత్తయ్యే తేయాకులో సింహభాగం ఇక్కడే పండిస్తుండటం విశేషం. మొదట్లో సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఏకాక్షరి సామాన్యులకు చేరువ కావడానికి వందల ఏండ్లు పట్టింది. అంతేకాదు, తేనీటిని కేవలం ఔషధంగా మాత్రమే భావించేవాళ్లు. కాలక్రమంలో రోజువారీ పానీయంగా గుర్తించారు. మొత్తంగా చైనాను దాటిన తేనీరు జపనీయుల మనసులూ గెలిచింది. ఇప్పటికీ జపాన్‌లో ఏటా ఊరూవాడా టీ ఫెస్టివల్ చేసుకునే స్థాయికి ఎదిగింది.
రెండు వరుసల టీ
కావలసినవి: పాలు: పావు లీటరు, నీళ్లు: పావు లీటరు, టీ పొడి: రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: పాలను సగం అయ్యేవరకు మరగపెట్టాలి. వాటిని బాగా నురుగు వచ్చేలా తిరగబోయాలి. రెండు గ్లాసుల్లోకి సమంగా పోసుకోవాలి. మరో గిన్నెలో నీళ్లు వేడి చేసి టీ పొడి వేయాలి. డికాక్షన్ సగం అయ్యేవరకు మరిగించాలి. చక్కెర వేసి కలపాలి. ఇప్పుడు డికాక్షన్ను చెంచా అడ్డుగా ఉంచి నురగ పక్కగా గ్లాసులోకి జాగ్రత్తగా పోసుకోవాలి. చిక్కగా మారిన పాలమీద డికాక్షన్ తేలి జోడు వరుసల తేనీరు సిద్ధమవుతుంది.
‘టీ’కా తాత్పర్యం
మన జీవితంలో మహోన్నతమైన ధ్యానం సాధ్యమయ్యే సమయం తేనీరు సేవించేదే!
జపాన్ నానుడి
Read More :
Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Tea History | తేయాకు తోటలను కాపాడుకునేందుకు చైనీయులు అంతలా కష్టపడ్డారా?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

