Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea Tales | తొలిసంధ్య తూరుపు వేదికపై నర్తిస్తున్న వేళ.. లేలేత అరుణ కిరణాలు మీటి కెరటాలు భూపాల రాగాన్ని ఆలపిస్తున్న తరుణాన.. చక్కటి ఉదయాన చిక్కటి టీ ఆస్వాదించడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి?
Tea Tales | తొలిసంధ్య తూరుపు వేదికపై నర్తిస్తున్న వేళ.. లేలేత అరుణ కిరణాలు మీటి కెరటాలు భూపాల రాగాన్ని ఆలపిస్తున్న తరుణాన.. చక్కటి ఉదయాన చిక్కటి టీ ఆస్వాదించడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? కొండల్లో తేయాకు తోటలు ఉన్నందుకో ఏమో.. మలయమారుతం మనసుకు అంత హాయినిస్తుంది! ఆ కోనల్లో విహారానికి వెళ్లినప్పుడు తేయాకు తోటల మలుపు. అక్కడ రెస్టారెంట్‌ను మరిపించే తేనీటి విక్రయ కేంద్రం. కారు టక్కున ఆగిపోతుంది. తేనీటి పరిమళాలు మెదడును ఇలాంటి అసంకల్పిత ప్రతిచర్యకు పురిగొల్పడం సహజమే కదా! ఆగినవాళ్లు టీ ఆర్డర్ ఇస్తారు. దానిని సిద్ధం చేసి తెచ్చే క్రమంలో కొట్టు యజమాని తమ తేయాకు తోట విశేషాలను వారితో పంచుకుంటాడు. తలూపుతూ ఊ కొట్టిన అతిథులను తాజా తేనీటి పరిమళం మరోసారి లాగేస్తుంది. సరైన రంగు, గుబాళించే వాసన ఏకాక్షరి సాధకులకు మరింత హుషారునిస్తుంది.
టీ కప్పు చేత్తో అందుకొని ఒక సిప్ చేసిన తర్వాత మనకు తెలియకుండానే మనసు తేలియాడుతుంది. అదే ఉత్సాహంలో మరో టీ ఆర్డర్ ఇచ్చి.. దాన్నీ తాగేసి.. తిరుగుముఖం పడుతున్న వారికి బిల్ కౌంటర్ దగ్గర తేయాకు పొట్లాలు వెనక్కి లాగుతాయి. ‘ధర ఎంత?’ అని సహజంగా అడగటం, యజమాని రేటు చెప్పడం, ఇందాక టీ తాగిన మత్తులో రెండు కిలోలు ఇవ్వమని కొనడం ఇవన్నీ అనుకోకుండానే జరిగిపోతాయి. తీరా విహారం ముగించుకొని ఇంటికి వచ్చి, మొత్తం పర్యటనలో కొనుగోలు చేసిన ఘనమైన వస్తువుగా టీపొడిని పరిచయం చేయడం సాధారణంగా జరిగేదే!! ఆ చాయ్పత్తాలో ఎంత చేవ ఉందనేది మర్నాడు ఆ పొడితో చేసిన టీ సిప్ చేస్తే గానీ తెలియదు. మోహన రాగంతో మొదలవ్వాల్సిన ఫీల్ గుడ్ మార్నింగ్ కాస్తా శివరంజనీ రాగంలా నిస్తేజంగా స్టార్టవుతుంది. ఆ తేయాకు తోటవాడు రుచికరమైన టీతో తనను బోల్తాకొట్టించాడని అప్పుడు గానీ అర్థం కాదు. ఇలాంటి అనుభవం టీ మీద మోజున్న చాలామందికి ఎదురయ్యేదే!!
బెల్లం టీ
కావలసినవి: నీళ్లు: ఒకటిన్నర కప్పు, టీ పొడి: ఒక టేబుల్‌స్పూన్, బెల్లం (తరుగు): ఒకటిన్నర కప్పు, పాలు: ఒకటిన్నర కప్పు, యాలకులు: రెండు, అల్లం: అర అంగుళం (తరిగి)
తయారీ: గిన్నెలో నీళ్లు పోసి కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి అల్లం తరుగు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు టీ పొడి వేసి, ఒక నిమిషం తర్వాత బెల్లం వేయాలి. బెల్లం కరిగేంత వరకు బాగా కలపాలి. మరో గిన్నెలో పాలు పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. వీటిని మరుగుతున్న డికాక్షన్లో పోసుకోవాలి. చల్లారిన పాలను బెల్లం ఉన్న డికాక్షన్లో పోస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది. పాలు కలిపిన టీ ఒక పొంగు వచ్చే వరకు మరిగించి కప్పుల్లోకి వడగట్టుకోవాలి.
‘టీ’కా తాత్పర్యం
తేనీరు అనే మాటలోనే ఓ సమ్మోహక శక్తి ఉంది
డోర్తీ ఎల్ సేయిర్స్, ఆంగ్ల రచయిత్రి
Read More :
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Tea History | తేయాకు తోటలను కాపాడుకునేందుకు చైనీయులు అంతలా కష్టపడ్డారా?
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- tea
- tea culture
- Tea History
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

