Tea History | చైనాలో మాత్రమే దొరికే ఈ టీ పొడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
Tea History | ఒక టీ పొడి పరిమళం వీధి వీధంతా గుబాళిస్తుంది. మరో టీ.. రంగు, రుచితోపాటు చిక్కదనాన్నీ సంతరించుకొని ట్రిపుల్ ధమాకా అందిస్తుంది. ఇంకో టీ ‘వాహ్' అనేంత టేస్టుంటుంది. తేనీటి రుచి అంతా చాయపత్తదే! శుద్ధతను బట్టి తేయాకు ఖరీదు ఉంటుంది.
Tea History | ఒక టీ పొడి పరిమళం వీధి వీధంతా గుబాళిస్తుంది. మరో టీ.. రంగు, రుచితోపాటు చిక్కదనాన్నీ సంతరించుకొని ట్రిపుల్ ధమాకా అందిస్తుంది. ఇంకో టీ ‘వాహ్’ అనేంత టేస్టుంటుంది. తేనీటి రుచి అంతా చాయపత్తదే! శుద్ధతను బట్టి తేయాకు ఖరీదు ఉంటుంది. ఆకాశాన్నంటే ధరలున్న ఈ రోజుల్లో కిలో టీ పొడి ఖరీదు రూ.1,200 మించదు. కానీ, చైనాలో పుట్టి పెరిగిన డా హాంగ్ పావో ( Da Hong Pao ) టీ పొడిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! కిలో తేయాకు ధర అచ్చంగా రూ.10 కోట్లు మరి! వంద గ్రాముల తేయాకు కొనాలన్నా రూ.కోటి వెచ్చించాల్సిందే!
చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్ వుయిసాస్ ప్రాంతంలో ఈ తేయాకు మొక్కల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ తరహా మొక్కలు చాలా అరుదుగా ఉన్నాయట. వాటిని ప్రత్యేక పద్ధతుల్లో పెంచుతారట. పైగా డా హాంగ్ పావో తేయాకులో అనేక రోగాలను నయం చేసే ఔషధ గుణాలున్నాయని పరిశోధనల్లో తేలింది. అందుకే, దీనికి తేయాకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ టీ తాగితే ప్రాణాంతక వ్యాధులు నయం అవుతాయని కొందరు విశ్వసిస్తారు. దీనికి బలం చేకూర్చేలా ఓ కథ ప్రచారంలో ఉంది. చైనాను మింగ్ వంశీయులు చాలాకాలం పాలించారు. ఆ వంశానికి చెందిన ఒక రాణి అనారోగ్యంతో మంచాన పడిందట. పట్టమహిషి మంచం పట్టడంతో మనోవ్యాధితో రాజు కూడా వ్యాధిగ్రస్తుడయ్యాడట. ఆస్థాన వైద్యులు డా హాంగ్ పావో తేయాకు చాయ్‌తో వైద్యం చేయడంతో కొద్ది రోజుల్లో రాణి కోలుకుందట! రాణీగారు మంచం దిగగానే.. రాజుగారి మనసు కుదుటపడి ఆరోగ్యం పుంజుకుందట! అప్పటినుంచి ఈ టీని మృత సంజీవనిగా భావిస్తారు. కాలక్రమంలో ఈ తేయాకు మొక్కలు చాలావరకూ అంతరించిపోయాయి. ఇప్పటికీ కొన్ని తల్లి మొక్కలను కాపాడుతూ డా హాంగ్ పావో జాతిని కాపాడుతున్నారు. 1972లో తమ దేశంలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌కు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ మావో 200 గ్రాముల డా హాంగ్ పావో టీ బ్యాగ్ ఇవ్వడం విశేషం!
లావెండర్ టీ
కావలసినవి: నీళ్లు: ఒక కప్పు, లావెండర్ బడ్స్ టీ బ్యాగ్: 1, తేనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్, నిమ్మకాయ: సగం ముక్క
తయారీ: స్టౌ మీద గిన్నె పెట్టి నీళ్లను బాగా మరిగించాలి. గ్లాసులో తేనె పోసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత గ్లాసులోకి ఒంపుకోవాలి. టీ బ్యాగ్ వేసి రెండు నిమిషాలు ఆడించాలి. పరిమళాలు వెదజల్లే లావెండర్ టీ సిద్ధం. హాయిగా ఆస్వాదించడమే.
‘టీ’కా తాత్పర్యం
ఒక్కో కప్పు టీ.. ఒక్కో ఊహాలోకంలో విహరింపజేస్తుంది.
– క్యాథెరీన్ డౌజల్, ఆంగ్ల రచయిత
Read More :
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- china
- tea
- Tea History
- tea tales
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

