Yoga | ఆలుమగల బంధం సమయంతో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ ఎంత ఎక్కువ సమయం కలిసి గడిపితే.. ఆ బంధం అంత చిక్కగా తయారవుతుంది. ఇంటిపని, ఆఫీసు, పిల్లల పెంపకం, ఇతర బాధ్యతల కారణంగా.. దంపతులిద్దరూ ఓ గంటైనా కలిసి గడిపేందుకు వీలు చిక్కకపోవచ్చు. కానీ, ఏ పనిచేసినా.. ఇద్దరూ కలిసి చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇంటిపని, వర్కవుట్లు, యోగా కలిసి సాధన చేస్తే… శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆనందం పొందవచ్చు. భాగస్వామితో కలిసి యోగా చేస్తే.. కలిగే యోగాలేంటో చూద్దాం..