శనివారం 05 డిసెంబర్ 2020
Komarambheem - Nov 23, 2020 , 00:46:09

వేదికలను వారంలోగా పూర్తిచేయాలి

వేదికలను వారంలోగా పూర్తిచేయాలి

  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీసీఈవో సాయిగౌడ్‌

దహెగాం : మండలంలోని ఆయా గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలను వారం రోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ సీఈవో సాయిగౌడ్‌ సూచించారు. మండలంలోని కోత్మీర్‌, బీబ్రా, దహెగాంలో రైతు వేదికల నిర్మాణాలతో పాటు ఇట్యాల, బోర్లకుంట, కోత్మీర్‌, బీబ్రా, ఐనం, దహెగాం గ్రామాల్లోని ప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డులు, శ్మశా నవాటికలు, రైతు కల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు వేదికలతో పాటు పలు పంచాయతీల్లో డంపింగ్‌ యా ర్డులు, శ్మశానవాటికల నిర్మాణాలు పూర్తికాలేదని, వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రకృతి వనాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ప్రతి మొక్క నూ పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో వెంకట్‌శైలేశ్‌, డీపీవో రమేశ్‌, ఎంపీడీ సత్యనారాయణ, ఎంపీ వో రాజేశ్వర్‌గౌడ్‌, సర్పంచ్‌లు పుప్పాల లక్ష్మి, జయందర్‌, కృష్ణమూర్తి, తరున్నం సుల్తానా, మధూకర్‌, మురారి తదితరులు పాల్గొన్నారు.