కృష్ణా జలాల ఒప్పందం.. ఆయకట్టు రైతులకు నష్టం..
కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పటిస్తూ కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందం నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు ఎంతో నష్టదాయకమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు.
- నీటి హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకే మరో ఉద్యమం
- ‘చలో నల్గొండ’ సభకు తరలివెళ్లే సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్‌రాజు
మధిర/ బోనకల్లు/ చింతకాని/ ఎర్రుపాలెం/ కూసుమంచి, ఫిబ్రవరి 13 : కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పటిస్తూ కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందం నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు ఎంతో నష్టదాయకమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నీటి హక్కుల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని తేల్చిచెప్పారు. ఇందుకోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘చలో నల్గొండ’ సభను నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ తరలివెళ్లి ఈ సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల సాధన కోసం నల్గొండ సభకు వెళ్లే బీఆర్ఎస్ శ్రేణుల వాహనాలను మధిరలో మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాలను సాధించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కాగా, మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు కలిసి పెద్ద సంఖ్యలో బయలుదేరి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో నల్గొండకు తరలి వెళ్లారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ పిలుపు మేరకు ఈ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.
సండ్ర ఆధ్వర్యంలో నల్గొండకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
కల్లూరు, ఫిబ్రవరి 13: కృష్ణా జలాల సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఛలో నల్గొండ కార్యక్రమానికి కల్లూరు, తల్లాడ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు బస్సులు, కార్లలో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు నుంచి బయలుదేరిన కార్లు, బస్సులను తల్లాడలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలూ శ్రమించి రాష్ర్టాన్ని సాధించి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రం అభివృద్ధిలో నడిపించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహనరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్తుపల్లి..
సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 13: పట్టణంలోని సిద్ధారం రోడ్లో లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్ నుంచి నల్గొండలో జరుగనున్న బహిరంగ సభ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. సండ్ర వెంకటవీరయ్య సారధ్యంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, నాయకులు పాల్గొన్నారు.
పెనుబల్లి…
పెనుబల్లి, ఫిబ్రవరి13: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు నల్గొండ తరలివెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వైరా..
వైరారూరల్, ఫిబ్రవరి 13: కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు మాజీ ఎమ్మెల్యే, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బానోత్ మదన్‌లాల్ ఆధ్వర్యంలో మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు.
ర్యాలీని ప్రారంభించిన ఖమ్మం మేయర్ నీరజ
ఖమ్మం, ఫిబ్రవరి 13 : నల్గొండలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఖమ్మంలోని గట్టయ్యసెంటర్‌లో ఉన్న తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తలు అధికసంఖ్యలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్లలో నల్గొండకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కార్ల ర్యాలీని నగర మేయర్ పునుకొల్లు నీరజ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసేందుకు కేఆర్బీపీ అప్పగించిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ చూశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడునెలలు కూడా కాకముందే రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. నల్గొండకు తరలిన వారిలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, చిరుమామిళ్ల రవికిరణ్, డోకుపర్తి సుబ్బారావు, నాగండ్ల కోటేశ్వరరావు, మాటేటి నాగేశ్వరరావు, ఆళ్ల నిరీశ అంజిరెడ్డి, మేడారపు వెంకటేశ్వర్లు, ధనాల శ్రీకాంత్, పాలడుగు పాపారావు, పత్తిపాక రమేశ్, కన్నం ప్రసన్నకృష్ణ, జంగం భాస్కర్, జానీ, రామ్మోహన్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, పైడిపల్లి సత్యనారాయణ, కొనగంచి ప్రసాద్, పొదిల నాగరాజు, కిషన్‌నాయక్, దేవభక్తిని కిషోర్, హరిప్రసాద్, మెంటెం రామారవు, ప్రదీప్, గుత్తా రవి, వీరూనాయక్, కుర్రా భాస్కర్‌రావు, తాతా వెంకటేశ్వర్లు, గొల్లపూడి హరికృష్ణ, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, నర్సింహారావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

