కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 9 : దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, విపత్తుల సమయంలో ధైర్యంగా సేవ చేసేందుకు విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతో దోహదపడుతుందని జీఎం పర్సనల్ బసవయ్య అన్నారు. శుక్రవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్యాట్రోల్ లీడర్ శిక్షణా శిబిరాన్ని స్థానిక చిల్డ్రన్స్ పార్కులో ఆయన ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల పాఠశాల విద్యార్థులకు ఐదురోజులు శిక్షణ ఇవ్వనున్నారు.
నేర్చుకున్న అంశాలపై పట్టు సాధించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైపీఎం సుశీల్‌కుమార్, కొత్తగూడెం, ఇల్లెందు, గోలేటి, మందమర్రి పాఠశాలల నుంచి, మాస్టర్ ఈకే విద్యాలయం, శ్రీశారద విద్యాలయం, సెయింట్ విన్సెంట్, బాలాజీ స్కూల్, భూపాలపల్లి, ఉజ్వల ఉన్నత పాఠశాల, ఫాతిమా ఉన్నత పాఠశాల, కాగజ్‌నగర్, కొమరంభీం ఆసీఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, స్కౌట్స్ స్టూడెంట్స్, వారి స్కౌట్ మాస్టర్లు, రోవర్ స్కౌట్ లీడర్లు, రోవర్లు పాల్గొన్నారు.