కారేపల్లి, నవంబర్ 24 : తలనొప్పి కోసం వాడుతున్న మాత్రలు అధికంగా మింగి అవి వికటించడంతో యువతి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం జైత్రాంతండాలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. జైత్రాంతండాకు చెందిన ఇస్లావత్ జ్యోతిక (20) కొంతకాలంగా తలనొప్పితో బాధ పడుతుంది. మూడు రోజుల క్రితం తలనొప్పి అధికంగా రావడంతో దానికి వాడుతున్న మాత్రాలను అధికంగా వేసుకుంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించడంతో మృతి చెందింది. జ్యోతిక పెద్దనాన్న దాస్ ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ బైరు గోపి కేసు నమోదు చేశారు.