కారేపల్లి, ఆగస్టు 11 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన బానోత్ సంతు తన ద్విచక్ర వాహనంపై కారేపల్లి క్రాస్ రోడ్ వైపు వెళ్తున్నాడు. కారేపల్లి క్రాస్ రోడ్ గ్రామ ప్రారంభంలో రోడ్డు మధ్యలో ఉన్న గుంటను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో సంతు తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.