ఖమ్మం రూరల్, జూలై 12 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేట కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ పసుపులేటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ఎల్లో డే వేడుకను ఘనంగా నిర్వహించారు. కేంద్రానికి వచ్చే పిల్లలందరూ పసుపు వర్ణం కలిగిన దుస్తులు ధరించారు. పసుపు కలర్ ఆట వస్తువులతో ఆటాపాట నిర్వహించారు. అనంతరం కేంద్రంలో పసుపు కలర్ కలిగిన పండ్లు పసుపు రంగు వెజిటేబుల్స్ తో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరు సంవత్సరాల లోపు గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని పిల్లల తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరోజిని, సరిత పాల్గొన్నారు.
Khammam Rural : అంగన్వాడీ కేంద్రంలో ఎల్లో డే వేడుకలు