ఖమ్మం రూరల్, జూలై 29 : ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్‌గా యామిని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ హోదాలో సేవలందిస్తున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూపాల్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. యామిని గతంలో వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రార్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఇన్చార్జి హోదాలో ఆమె వరంగల్ నుంచి ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్‌గా బదిలీపై రావడం జరిగింది. నూతన సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన యామినికి కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.