కారేపల్లి, ఆగస్టు 01 : మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మహిళాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని ఖమ్మం జిల్లా కారేపల్లి ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటి వరకు కారేపల్లి మండలానికి ఇన్చార్జి ఏపీఎంగా ఉన్న వెంకటేశ్వర్లు రెగ్యూలర్ ఏపీఎంగా ఉత్తర్వులు అందుకోవడంతో ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. తనపై మహిళా సంఘాలు, ఐకేపీ సిబ్బంది ఉంచిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు బి.చైతన్య, తుమ్మలపల్లి అనిల్, పగడాల పుష్ప, గౌసియా, సొందు, గ్రామ దీపికలు కుర్ర శ్రీను, భూక్యా రాంబాబు, మాలోత్ బాలు, నూకల సతీశ్, బాబులాల్ పాల్గొన్నారు.